ఉద్యోగులు యుద్ధానికి సిద్ధం కావాలి
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నదని, తమకు ఇచ్చిన ఏ మాటపైనా నిలబడ లేకపోతున్నదని, తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 15 తర్వాత విశ్వరూపం చూపిస్తామని ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ హెచ్చరించారు. శనివారం కరీంనగర్‌లోని టీఎన్జీవో సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
- మా సహనాన్ని పరీక్షిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం
- నెలకు రూ.700 కోట్ల పెండింగ్ బిల్లులు ఏమైనయి?
- కంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం తెస్తామని ఊసేలేదు
- టీఎన్జీవోస్ అధ్యక్షుడు మారం
- 15 తర్వాత ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరిక
కరీంనగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నదని, తమకు ఇచ్చిన ఏ మాటపైనా నిలబడ లేకపోతున్నదని, తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 15 తర్వాత విశ్వరూపం చూపిస్తామని ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ హెచ్చరించారు. శనివారం కరీంనగర్‌లోని టీఎన్జీవో సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
నెలకు రూ.700 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని, కంట్రిబ్యూషన్ ఆధారిత ఎంప్లాయీస్ హెల్త్ స్కీంను ప్రవేశ పెడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. జీపీఎఫ్ బిల్లులు ఇవ్వడం లేదని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం లేదని, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పిల్లల పెండ్లిళ్లు చేయలేక పోతున్నామని, కుటుంబం గడవడానికి చేసిన అప్పులు తీర్చలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇతర సంక్షేమ పథకాలకు వాడడం వల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఆర్సీ గురించి ఎలాంటి ప్రస్తావన చేయడం లేదని, సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని, ఇప్పుడు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇదివరకే మంత్రులు, అధికారుల కమిటీలు ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం మళ్లీ కమిటీల పేరిట కాలయాపన చేస్తే సహించేది లేదని స్పష్టంచేశారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెల 15 తర్వాత ప్రత్యక్ష పోరాటానికి దిగి, తమ విశ్వరూపం చూపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే ఆచరణలో పెట్టాలని అడుగుతున్నామని, ఇంకెన్నాళ్లు ఓపిక పట్టాలని ప్రశ్నించారు. ఆగస్టు 15 వరకు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చామని వెల్లడించారు. ఉద్యోగులు అసహనానికి గురికాకముందే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో టీఎన్జీవోల సం ఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

