హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు, 449 కాంట్రాక్ట్, 53 పార్ట్ టైం హవర్లీ, 43 పార్ట్ టైం కన్సాలిడేట్, 3 మినిమం టైం సేల్ లెక్చరర్లు, 78 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగిస్తూ ఆర్థిక శాఖ జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
‘ఆలిండియా ఎస్టీ’ ఎక్సైజ్ కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఆలిండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఎక్సైజ్) కార్యవర్గం ఎన్నిక బుధవారం హైదరాబాద్‌లోని అబారీ భవన్లో జరిగింది. అధ్యక్షుడిగా రంగారెడ్డి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్ ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ కుమార్, కోశాధికారికగా కే శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
టీహబ్‌లో బోయింగ్ ఇన్నోవేషన్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఏరోస్పేస్ టెక్నాలజీలో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు టీహబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్, బోయింగ్ వర్సిటీతో కలిసి ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. వివరాలకు https://bit.ly/ 3yjnNp3లో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.