Telangana Building Rules | తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. టీడీఆర్ వినియోగంపై కొత్త మార్గదర్శకాలను ఇస్తూ జీవో జారీ చేసింది. దీని ప్రకారం 21 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న భవనాలను హై రైజ్‌గా గుర్తించనున్నారు. 750-2000 చదరపు మీటర్ల ప్లాట్లలో 18-21 మీటర్ల భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేసింది.
అలాగే నాన్ హై రైజ్ బిల్డింగ్స్‌కు సెట్‌బ్యాక్‌ను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. హై రైజ్ భవనాల్లో 10 శాతం వరకు సెట్‌బ్యాక్ రిలాక్సేషన్‌కు అనుమతినిచ్చింది. 2000చ.మీ.కు పైగా ప్లాట్లలో అదనపు అంతస్తులకు అవకాశమిచ్చింది. 40 ఫీట్ల రోడ్డు దగ్గర 3 అదనపు అంతస్తులకు అనుమతినిచ్చింది. 60 ఫీట్ల రోడ్డు దగ్గర 4 అదనపు అంతస్తులకు అనుమతిని ఇచ్చింది. 80 ఫీట్ల రోడ్డు దగ్గర ఐదు అదనపు అంతస్తులకు అనుమతి కల్పించింది. 10 అంతస్తులకు పైగా భవనాల్లో టీడీఆర్ వినియోగం తప్పనిసరి చేసింది. 20 అంతస్తులకు పైగా భవనాలకు 5 శాతం టీడీఆర్ లోడింగ్, బిల్డింగ్ అనుమతి సమయంలో 50 శాతం టీడీఆర్ సమర్పించాలని మార్గదర్శకాల్లో తెలిపింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు ముందు మిగతా 50 శాతం టీడీఆర్ సమర్పించాలని పేర్కొంది.