సీట్లు సమానం.. ఓట్లు అధికం
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ చెరో ఎనిమిది స్థానాలు సాధించగా, ఓట్లలో మాత్రం భారీ తేడా ఉన్నది. బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి 10.93 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి.
- బీజేపీ కంటే 10 లక్షల ఓట్లు ఎక్కువ సాధించిన కాంగ్రెస్
- రెండు పార్టీలకు చేరో 8 సీట్లు
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ చెరో ఎనిమిది స్థానాలు సాధించగా, ఓట్లలో మాత్రం భారీ తేడా ఉన్నది. బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి 10.93 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. సీట్లలో మాత్రం తేడా లేకపోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీకి 87,40,568 ఓట్లు రాగా బీజేపీకి 76,47,064 ఓట్లు వచ్చాయి.
కానీ, సీట్లు మాత్రం ఇద్దరికి సమానంగా రావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలవగా, బీజేపీ అభ్యర్థులు మాత్రం తక్కువ మెజార్టీలతో విజయం సాధించారు. దీంతో బీజేపీకి తక్కువగా ఓట్లు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలిచిన స్థానాల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు.
36 లక్షల ఓట్లు సాధించిన బీఆర్ఎస్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లోక్‌సభ ఎన్నికల్లో 36 లక్షల ఓట్లను సాధించింది. రాష్ట్రంలోని 17 స్థానాలకుగాను రెండు స్థానాల్లో రెండోస్థానంలో, 14 స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ స్థానంలో నాలుగో స్థానం దక్కించుకున్నది. బీఆర్ఎస్ పార్టీ 16.68 శాతం ఓట్లను పొందింది. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది.
మిగిలిన స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. రెండు జాతీయ పార్టీలు, అధికార పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా, విష ప్రచారంచేసినా, ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఒకరికి ఒకరు సహకారంలో భాగంగా బలహీనమైన అభ్యర్థులను పెట్టుకొని బీఆర్ఎస్ను దెబ్బతియాలని చూశారు. అయినా ప్రజల ఆదరణ అభిమానాన్ని చురగొని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా బీఆర్ఎస్ దాదాపుగా 17 శాతం ఓట్లు సాధించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

