జవహర్ నగర్లో రేవంత్ రెడ్డికి భారీ షాక్!
రేవంత్ రెడ్డి | టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకంతో ఏదో ఊడిపడుతుందనుకున్న హస్తం అధిష్ఠానానికి షాక్ మీద షాక్ తగులుతున్నది. ఆయన మల్కాజిగిరి

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మేడ్చల్, జూలై 12 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకంతో ఏదో ఊడిపడుతుందనుకున్న హస్తం అధిష్ఠానానికి షాక్ మీద షాక్ తగులుతున్నది. ఆయన మల్కాజిగిరి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతున్నది. తాజాగా జవహర్‌నగర్, తూంకుంట మున్సిపాలిటీల పరిధిలోని పార్టీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరడంతో మిగిలిన కొద్దోగొప్పో క్యాడర్ కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నది. ఘట్కేసర్ మున్సిపాలిటీకి చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరారు. జవహర్‌నగర్ కార్పొరేషన్లో 28 స్థానాలకు నాలుగు స్థానాలే కాంగ్రెస్‌కు దక్కాయి. ప్రస్తుతం ఈ నలుగురు కార్పొరేటర్లు కూడా టీఆర్ఎస్లో చేరడంతో ఆ కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. తూంకుంట మున్సిపాలిటీలోనూ రెండు వార్డులు కాంగ్రెస్‌కు దక్కగా.. రేపోమాపో ఆ ఇద్దరు కౌ న్సిలర్లు రాజ్‌పుత్ పూజ భరత్‌సింగ్, సింగిరెడ్డి మాధుసూదన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని మేడ్చల్ జిల్లాలో కీలకనేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇదివరకే పార్టీని విడిచిపెట్టారు. త్వరలో మరింత మంది కీలక కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

