తరాలుగా దళితులను మీరు దగా చేసిండ్రు
ఓటు బ్యాంకు లెక్కనే వాళ్లనెపుడు చూసిండ్రు
నేడు చూడు వాళ్లంతా నిబ్బరంగా నిలుచుండ్రు
మిమ్ములను తరిమికొట్ట వారంతా వస్తుండ్రు
మీటర్లు పెట్టకుంటే నిధులు వాళ్లు ఇవ్వరట
మోటర్లు మార్చకుంటే వీళ్లు ఒదిలిపెట్టరట
పచ్చవడ్డ తెలంగాణ చూసి ఈ కడుపుమంట
ఓటుతోని బుద్ధి చెప్పి తరిమి తరిమి కొట్టమంట
…? దండమూడి శ్రీచరణ్