Left Parties | బాబ్బాబు ఓ రెండు సీట్లిచ్చి మా పరువు కాపాడండి.. కాంగ్రెస్‌ను బతిమాలుతున్న వామపక్షాలు
బాబ్బాబు ఓ రెండు సీట్లిచ్చి మా పరువు కాపాడండి అంటూ వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌ను బతిమాలుకుంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లాలనుకున్న వామపక్షాల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టుగా తయారయ్యింది.
- అడిగిన సీట్లు ఇచ్చేందుకు నేతలు ససేమిరా
Left Parties | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బాబ్బాబు ఓ రెండు సీట్లిచ్చి మా పరువు కాపాడండి అంటూ వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌ను బతిమాలుకుంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లాలనుకున్న వామపక్షాల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టుగా తయారయ్యింది. తమకు బలమున్న స్థానాలను కేటాయించాలని వామపక్షాలు కోరుతుండగా..
అవి ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ తేల్చిచెప్తున్నది. బీఆర్ఎస్తో విభేదించిన లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ కూడా దగ్గరికి రానివ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్న సందిగ్ధంలో పడిపోయాయి. జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో కలిసి ఉన్నందున జాతీయ నాయకత్వం నుంచి ఒత్తిడి తెచ్చి కావాల్సిన స్థానాలు దక్కించుకోవాలనుకున్న వామపక్షాలకు కాంగ్రెస్ స్థానిక నాయకత్వం తీరు మింగుడుపడటం లేదు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై.. తాము పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాల జాబితాను అందించారు. కమ్యూనిస్టులు కోరుతున్న స్థానాలను ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న నేతలకు హామీ ఇచ్చామని, మరికొన్ని తమ సిట్టింగ్ సీట్లనీ, మరి కొన్నింటిలో తాము బలంగా ఉన్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తాము అడిగిన సీట్ల కోసం మరో దశ చర్చలు జరుపుతాం అని లెఫ్ట్ పార్టీల నేతలు చెప్పడం వారి దీనావస్థకు అద్దం పడుతున్నది. లెఫ్ట్ పార్టీలకు చెరో రెండు సీట్లకు మించి ఇచ్చేది లేదని కాంగ్రెస్ అంటున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

