బీసీలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ
కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయని, ఆ పార్టీలతోనే బీసీలకు రాజకీయ పదవులు అందకుండా పోతున్నాయని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. రెండు పార్టీలు బీసీలకు రాజకీయ అధికారాన్ని, బడ్జెట్ కేటాయింపులను నిరాకరిస్తున్నాయని మండిపడ్డారు.
- ఆ పార్టీలతోనే బీసీలకు అందని పదవులు
- 42% రిజర్వేషన్ హామీలోనూ మోసం
- మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
- బీసీలపై కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి లేదు
- మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం
కవాడిగూడ, నవంబర్ 30 : కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయని, ఆ పార్టీలతోనే బీసీలకు రాజకీయ పదవులు అందకుండా పోతున్నాయని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. రెండు పార్టీలు బీసీలకు రాజకీయ అధికారాన్ని, బడ్జెట్ కేటాయింపులను నిరాకరిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగ సవరణతో బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడాన్ని నిరసిస్తూ, తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద బీసీల యుద్ధభేరి మహాసభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలులో, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. బీసీలకు అన్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఎవరూ సాటి లేరని పేర్కొన్నారు. నెహ్రూ కాంగ్రెస్ నుంచి రాహుల్ కాంగ్రెస్ వరకు బీసీలను దగా చేసినవాళ్లే అని దుయ్యబట్టారు. బీసీలంతా ఐక్యమత్యంతో రిజర్వేషన్లు, రాజ్యాధికార దిశగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే ఆధిపత్య కులాల పునాదులు కదులుతాయని పేర్కొన్నారు.
బీసీ ఉద్యమ కార్యాచరణకు బీఆర్ఎస్ మద్దతు
మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీకి బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఆ పార్టీలు తలుచుకుంటే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టొచ్చని, వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఈ శీతాకాల సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగాన్ని సవరించి రాజ్యాంగబద్ధత కల్పించాలని డిమాండ్‌చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేయాలని, అందుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీల రాజకీయ శకం ప్రారంభమైందని, ఎంతమంది అడ్డుకున్నా దీన్ని ఆపలేరని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని నమ్మించి మోసగించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలు సర్పంచులు కాకుండా కోర్టులను వేదికలుగా చేసుకుని బీసీల నోటికాడ ముద్దను లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రిజర్వేషన్ల విషయంపై ఢిల్లీ ప్రభుత్వంతో తేల్చుకునేందుకు ఈ నెల 8, 9 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పోరాటం ప్రారంభిస్తామని, పార్లమెంటును ముట్టడిస్తామని వెల్లడించారు. తెలంగాణ బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశాచారి అధ్యక్షతన జరిగిన సభలో సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం, బీసీ జేఏసీ కో చైర్మన్ శేఖర్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు, పెద్దసంఖ్యలో బీసీలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

