బండిపై ఠాణాల్లో ఫిర్యాదుల వెల్లువ
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బీఆర్ఎస్ నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
- చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, బీఆర్ఎస్ శ్రేణుల వినతి
నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 5: పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బీఆర్ఎస్ నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్‌టౌన్ పీఎస్‌లో కనుకుంట్ల విష్ణుచరణ్ అనే విద్యార్థి బండిపై ఫిర్యాదు చేశాడు.
విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న బండిని కఠినంగా శిక్షించాలని కోరాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా మావల, జైనథ్, సిరికొండ, తలమడుగులో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మందమర్రి పోలీస్ స్టేషన్లో పదోతరగతి విద్యార్థులు ఐలవేని రామ్‌తేజ, బైరి తరుణ్, కోటపల్లి పోలీస్ స్టేషన్లో మల్లంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు ఇప్ప సాయివరుణ్, గోమాస భగవాన్ ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

