హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో రోడ్ల గుంతల పరిస్థితులపై సామాన్యుడి పోరుబాట ఫలించింది. ‘నమస్తే తెలంగాణ’ ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో అధికారులు స్పందించారు. శనివారం అర్ధరాత్రి ఇమ్లిబన్ పుత్లిబౌలి రోడ్లో ఎంజీబీఎస్ బస్‌స్టేషన్ నుంచి కోఠి , చాదర్‌ఘాట్ పోయే మార్గంలో పాత్‌హోల్స్ దగ్గర ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయంటూ ఫిరోజ్ అనే వ్యక్తి నడిరోడ్డుపై గుంతల వద్ద బైఠాయించాడు.
ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవడంతోపాటు ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ప్రచురించింది. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. గుంతలను ఒక్కరోజులోనే పూడ్చింది. దీంతో ‘నమస్తే తెలంగాణ’ను స్థానికులు అభినందించారు.