ఈ బుద్ధ జయంతికి ఓ ప్రత్యేకత
‘ఈ సారి బుద్ధ జయంతికి ఓ ప్రత్యేకత ఉన్నది.. ఓ వైపు సాక్షాత్తు 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, మరోవైపు అంబేద్కర్ సచివాలయం.. ఈ ప్రాంతంలో బౌద్ధ జయంతిని ప్రారంభించుకోవడం అద్భుత ఘట్టం’ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- మంత్రి శ్రీనివాస్ గౌడ్..
- అంబేద్కర్ రోడ్లో ‘పీస్ కార్ ర్యాలీ’ ప్రారంభం
ఖైరతాబాద్, మే 5 : ‘ఈ సారి బుద్ధ జయంతికి ఓ ప్రత్యేకత ఉన్నది.. ఓ వైపు సాక్షాత్తు 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, మరోవైపు అంబేద్కర్ సచివాలయం.. ఈ ప్రాంతంలో బౌద్ధ జయంతిని ప్రారంభించుకోవడం అద్భుత ఘట్టం’ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 2567వ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ ప్రాంగణంలో ‘బౌద్ధ పీస్ కార్’ ర్యాలీని ఏర్పాటు చేశారు.
ఈ ర్యాలీని ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు జి. పరందాములుతో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు పంచశీల జెండాను ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతి ఏడాది ఇదే వేదికగా బుద్ధ జయంతోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. బుద్ధుడు, మహాత్మాజ్యోతిబా పూలేలను ఆదర్శంగా తీసుకొని జాతికి మేలు జరగాలని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుండాలని, అది రిజర్వేషన్ల ద్వారానే సాధ్యమవుతుందని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ సతీశ్, జి.రాజేశ్వర్రావు, అశోక్ భాగ్యవన్, సుదర్శన్, సలహాదారులు చింతా శ్రీరామమూర్తి, కేకే రాజా, రావుల అంజయ్య పాల్గొన్నారు. గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా బోటులో బుద్ధుడి విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి ప్రార్థన చేశారు. మంత్రి వెంట పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్సుల్తానియా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి ఎండీ మనోహర్, టూరిజం అధికారులు శశీధర్, మనోహర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంలో బోటులో ప్రయాణించి బుద్ధుడి విగ్రహం వద్దకు చేరుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

