తెలంగాణ ఏర్పడిన తర్వాత సహకార సంఘాలు బలోపేతం : మంత్రి నిరంజన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సహకార సంఘాలు బలోపేతం అయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సహకార సంఘాలు బలోపేతం అయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ గృహకల్పలో తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి రాకతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో సహకార శాఖ ప్రాధాన్యం పెరిగిందని అన్నారు.నీటి వృధాను అరికట్టడం, సాగు చేయాల్సిన పంటల రకాల మీద రైతులను చైతన్యం చేసే బాధ్యత సహకార శాఖ అందిపుచ్చుకోవాలని సూచించారు.
ప్రతి రంగంలో మనుషుల మధ్య సంబంధాలను పెంచేందుకు సహకార శాఖ కృషిచేయాలన్నారు.సహకార సంఘాలు బలోపేతం కాకుంటే కార్పోరేట్ వ్యవస్థ వేళ్లూనుకుంటుందని పేర్కొన్నారు. పెరుగుతున్న సంపద దుర్వినియోగం కాకుండా కాపాడాలని, దాని వల్ల సమాజానికి నష్టం వాటిళ్లుతుందని స్పష్టం చేశారు. గతంలో సహకార సంఘాలలో ఉద్యోగాల జీతాలకు ఇబ్బందులుండేవని తెలిపారు.
సహకార ఉద్యోగులు వివిధ స్థాయిల వారు కేరళలోని సహకార సంఘాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర సహకార ఉద్యోగుల సంఘం నేత నర్సింహారెడ్డి, సంఘం అధ్యక్షులు జగన్ మోహన్ రావు, అడిషనల్ రిజిస్ట్రార్లు సుమిత్ర, శ్రీనివాసరావు, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

