అనాథ చిన్నారుల ఇంటి కల నెరవేర్చిన ట్రాన్స్‌కో సీఎండీ
చిన్నారుల ఇంటి కల | గతంలో కూలిపోయిన ఇంటి ముందు తల్లిదండ్రలు ఫోటోలు పట్టుకుని చిన్నారులు ఎవరైన దాతలు సహయం చేయక పోతరా అని దీనంగా ఎదురు చూసిన పరిస్థితి నుండి నేడు ట్రాన్స్కోఆండ్ జేన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సహకరంతో నూతన ఇంట్లో

‘నిలువ నీడలేదు సాయం చేయండి సారూ’ కథనానికి స్పందించిన సీఎండీ ప్రభాకర్‌రావు
నెల రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి
నమస్తే తెలంగాణ దినపత్రకకు కృతజ్ణతలు తెలిపిన అనాథ చిన్నారులు, గ్రామస్తులు
సంస్థాన్ నారాయణపురం : గతంలో కూలిపోయిన ఇంటి ముందు తల్లిదండ్రలు ఫోటోలు పట్టుకుని చిన్నారులు ఎవరైన దాతలు సహయం చేయక పోతరా అని దీనంగా ఎదురు చూసిన పరిస్థితి నుండి నేడు ట్రాన్స్కోఆండ్ జేన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సహకరంతో నూతన ఇంట్లో గృహ ప్రవేశం చేసి పూజ గదిలో తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తూ ఇద్దరు చిన్నారులు కన్నీటి పర్యంతమైయ్యారు. తామకు సహకరించిన దాతలు అందరికి చిన్నారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నూతనకంటి రాములు, ఉషమ్మ దంపతులు. వీరికి కూతురు రాజేశ్వరి(11), కుమారుడు శివ (9) ఉన్నారు. ఏడేండ్ల క్రితం తండ్రి మృతి చెందగా, సంవత్సరం క్రితం తల్లి చనిపోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. అంతేకాకుండా వారు ఉంటున్న ఇల్లు వర్షానికి కూలిపోయింది. దీంతో ఆ చిన్నారులు పడుతున్న అవస్థలపై నమస్తే తెలంగాణ దినపత్రకలో ‘నిలువ నీడలేదు సాయం చేయండి సారూ’ కథనం ప్రచురితమైంది.

ఈ కథనానికి స్పందించిన తెలంగాణ ట్రాన్స్‌కో అండ్ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు.. చిన్నారుల పూర్తి బాధ్యత తీసుకుని ఇల్లు నిర్మించి ఇచ్చారు. గురువారం ఆ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది. విద్యుత్ అధికారులు, గ్రామస్తులతో కలసి చిన్నారులు నూతన ఇంట్లో గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు చిన్నారులు సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో పాటు నమస్తే తెలంగాణ దినపత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఈఈ శివశంకర్, సర్పంచ్ కొండ పద్మశ్రీను, ఎంపీటీసీ నర్రి పావని, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యదర్శి నర్రి స్వామి, విద్యుత్ అధికారులు చుక్క గిరి, బోయ మల్లేష్, కడ్తాల కృష్ణ, కార్తీక్ గౌడ్, గణం నరిసింహ, దోనూరి శేఖర్ రెడ్డి, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

