కరీంనగర్ నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లగచర్లలో పోలీసుల దమనకాండ జాతీయస్థాయికి చేరడం, ప్రభుత్వ తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సీఎం రేవంత్రెడ్డి తొలిసారి పెదవి విప్పారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు-2024 పేరిట బుధవా రం వేములవాడలో జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. ఫార్మా విలేజ్ కోసం తాము సేకరించాలనుకున్న భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని పేర్కొన్నా రు. 75 ఏండ్లుగా తమ కొడంగల్ నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకోలేదని, ఆ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఎవ రూ మంత్రి కాలేదని చెప్పారు. తాను ముఖ్యమంత్రినయ్యాక అక్కడ అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. ఫార్మా విలేజ్ కోసం తామేమీ లక్ష ఎకరాలు సేకరించడం లేదని, తొండలు కూడా గుడ్లు పెట్టని 1100 ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
అక్కడ పరిశ్రమలు పెడితే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ప్రయత్నం చేస్తుంటే కొందరు గూండాలు, రౌడీమూకలను తయారుచేసి, పైసలు ఇచ్చి కలెక్టర్, ఆర్డీవోలు, అధికారులపై ఇష్టంవచ్చినట్టు దాడిచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులను కిందపడేసి కొట్టి చంపడానికి ప్రయత్నించిన వారిపై కేసులు పెడితే బీఆర్ఎస్ వాళ్లు తమ మీద కేసులు ఎలా పెడతారని అంటున్నరని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా? ఆ ప్రయత్నం మేం చేయొద్దా? అని ప్రశ్నించారు. కొడంగల్లో 1100 ఎకరాలు సేకరిస్తే మీకు కడుపు మంట ఎందుకని నిలదీశారు. భూసేకరణలో ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందేనని చెప్పారు. తమ భూమిని ఎవరూ ఇష్టంగా ఇవ్వరని, బాధలో ఉన్న రైతులకు నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
మూసాపేట, నవంబర్ 20: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కళాజాత బృందం బుధవారం మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులకు వచ్చింది. వారి వాహనాన్ని సంత ప్రాంతంలో నిలిపి కళాకారు లు ఆటపాటలతో ఉచిత బస్సు, రైతు భ రోసా, రుణమాఫీ పథకాల అమలును వివరించారు. సంతకు వచ్చిన కొందరు రైతులు, మహిళలు వారిపై తిరగబడ్డారు. ఏడ ఇచ్చిండో పథకాలు చూపించు.. అం టూ నిలదీశారు. బృందం సభ్యులు అక్క డి నుంచి వాహనంతో వెళ్లిపోయారు.