CM Revanth | రేవంత్‌కు పాలమూరులో ఎదురుదెబ్బ.. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ ఓటమి..!
CM Revanth | సీఎం రేవంత్‌రెడ్డికి సొంత జిల్లాలో ఘోర పరావభవం ఎదురైంది. ఆయన జిల్లా ప్రజలే కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి పాలమూరు ప్రజలు దెబ్బ మీద దెబ్బ కొట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఓటమి మరవకముందే..
- ముఖ్యమంత్రిని పట్టించుకోని సొంత జిల్లా మహబూబ్‌నగర్ ఓటర్లు
- సిట్టింగ్ స్థానం మల్కాజిగిరిలోనూ హస్తం అభ్యర్థికి తప్పని పరాభవం
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి సొంత జిల్లాలో ఘోర పరావభవం ఎదురైంది. ఆయన జిల్లా ప్రజలే కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి పాలమూరు ప్రజలు దెబ్బ మీద దెబ్బ కొట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఓటమి మరవకముందే.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీచంద్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ చేతిలో 4,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలోనే పార్టీని గెలిపించుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓటమిని తప్పించలేకపోయిన రేవంత్
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన మొదటి అభ్యర్థి మహబూబ్‌నగర్ స్థానానికే. వంశీచంద్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే బీజేపీ నుంచి డీకే అరుణను అభ్యర్థిగా ప్రకటించడంతో పోటీ తీవ్రంగా ఉంటుందని భావించిన రేవంత్‌రెడ్డి మరే నియోజకవర్గంలో నిర్వహించనన్ని బహిరంగసభలు, సమావేశాలు ఇక్కడ నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా తిరిగి వచ్చి మహబూబ్‌నగర్‌లో వాలిపోయేవారు. ఇక చివరికి సెంటిమెంట్ అస్త్రం కూడా ప్రయోగించారు. ఎన్ని చేసినా.. ఓటమి నుంచి పార్టీని తప్పించలేకపోయారు.
సిట్టింగ్ స్థానంలోనూ ఎదురుదెబ్బ
సీఎం రేవంత్‌రెడ్డి.. తన సిట్టింగ్ ఎంపీ స్థానం మల్కాజిగిరిలో కూడా పార్టీని గెలిపించలేకపోయారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి స్థానం నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. తన సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా పార్టీకోసం నిలబెట్టాలని బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన సునితాలక్ష్మారెడ్డికి పట్టుబట్టి మరీ మల్కాజిగిరి టికెట్ ఇప్పించారు. కానీ ఇక్కడాఆయనకు ఓటమి మహబూబ్‌నగర్, మల్కాజిగిరి రెండు స్థానాల్లోనూ బీజేపీ చేతిలోనే ఆయనకు ఓటమి ఎదురవడం గమనార్హం.
సీఎంగా రేవంత్‌ను చూడడం లేదా!
సీఎం తన సొంత జిల్లాలో కాంగ్రెస్ వరుస ఓటములపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో గెలువబోతున్నామని రేవంత్‌రెడ్డి మొదట్లో చెప్పారు. కానీ 109 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇప్పుడు మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంలోనూ అక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను పట్టించుకోలేదు. దీనిపై పార్టీలో పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. పాలమూరు ప్రజలు సీఎంగా రేవంత్‌రెడ్డిని అంగీకరించడం లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నట్టు తెలిసింది. ఈ ఓటములపై సీఎం రేవంత్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
కొడంగల్‌లో మెజార్టీ నిలుపుకోని రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డికి తన సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వచ్చిన మెజార్టీని ఎంపీ ఎన్నికల్లో నిలుపుకోలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్‌కు 32,532 ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో ఎంపీ ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజార్టీ అందించాలని ప్రజలను కోరారు. కానీ కొడంగల్‌లో కాంగ్రెస్‌కు కేవలం 21,854 మెజార్టీ మాత్రమే వచ్చింది. దాదాపు పది వేల ఓట్లకు పైగా మెజారిటీ తగ్గిపోగా డీకే అరుణ కేవలం 4.5 వేల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

