CM Revanth Reddy | భారీ వర్షాలపై సీఎం సమీక్ష.. అత్యవసరమైతే తప్ప బయటకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అత్యవసర సమీక్ష నిర్వహించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, మున్సిపల్, విద్యుత్, పంచాయతీ రాజ్, నీటిపారుదలశాఖ అధికారులు హాజరయ్యారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూశాఖ అధికారుల అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్, సాగునీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశించారు. సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలన్నారు.
వరదప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

