సీఎంవోలో కోడ్ ఉల్లంఘనలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న రాజీవ్‌గాంధీ వర్ధంతి లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను సైతం ఆ హ్యాండిళ్లలో పోస్టు చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
- రాజీవ్‌గాంధీ వర్ధంతికి సీఎం రేవంత్ హాజరైన వీడియో పోస్టు
- ఈసీ, సీఎస్‌కు డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ఫిర్యాదు
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న రాజీవ్‌గాంధీ వర్ధంతి లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను సైతం ఆ హ్యాండిళ్లలో పోస్టు చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ఎన్నికల సంఘంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేశారు.
అనంతరం తన ఫిర్యాదుపై ‘ఎక్స్’ ద్వారా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘సీఎంవో అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్లలో ఎలాంటి అప్డేట్లు లేదా ఫోటోగ్రాఫ్‌లు/వీడియోలను పోస్ట్ చేయకూడదు. కానీ, ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఈ ఉల్లంఘనలకు బాధ్యులైన అధికారులపై ఎన్నికల సంఘం, సీఎస్ కఠిన చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల అమలులో ఉన్నందున సీఎంవో సోషల్ మీడియా హ్యాండిళ్లలో ఇటీవల పోస్టు చేసిన అన్ని అప్డేట్లను తక్షణమే తొలగించడంతోపాటు జూన్ 5 వరకు వాటిలో ఎలాంటి అప్డేట్లు పోస్టు చేయకుండా చూడాలి’ అని దిలీప్ ఆ వివరణలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

