CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే కచ్చితంగా జనాభాను లెకించాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఎకడి నుంచి అయినా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. తొమ్మిది నెలల్లో ఒక రోజు కూడా తాను సెలవు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకురాబోతున్నామని, రాష్ట్రంలో ప్రతి ఒకరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు అందజేస్తామని చెప్పారు. రైతు రుణ విముక్తి కావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్ర భుత్వం కూడా 27 రోజుల్లో 18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. నాలుగోసారి గెలవడం కోసమే ప్రధాని మోదీ జమిలీ అంశం ఎత్తుకున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాహుల్ ఆలోచన మేరకు బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ కుమార్‌రెడ్డి నాయకత్వం లో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. పార్టీ నాయకత్వం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. నరేంద్రమోదీని ఓడించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉన్న సమయంలో పీసీసీ చీఫ్‌గా మహేశ్‌గౌడ్ బాధ్యతలు చేపట్టారని తెలిపారు.