Musi Development | 50 వేల కోట్లు.. 71 వేల కోట్లు.. 1.5 లక్షల కోట్లు!.. మూసీ సుందరీకరణపై 3 నెలల్లో పెరిగిన అంచనాలు
మూసీ ప్రక్షాళన అంచనా వ్యయం కేవలం మూడు నెలల్లోనే రూ.50వేల కోట్ల నుంచి రూ. లక్షన్నర కోట్లకు పెరిగింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 21న కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్కుమార్ తరఫున ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి రూ.50వేల కోట్లతో మూసీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు.
Musi Development | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20(నమస్తే తెలంగాణ): మూసీ ప్రక్షాళన అంచనా వ్యయం కేవలం మూడు నెలల్లోనే రూ.50వేల కోట్ల నుంచి రూ. లక్షన్నర కోట్లకు పెరిగింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 21న కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్కుమార్ తరఫున ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి రూ.50వేల కోట్లతో మూసీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు.
జూన్ 14న ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి విజినరీ లీడర్షిప్లో రూ.71వేల కోట్లతో మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు. శనివారం గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఐదేండ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టి మూసీకి ఊపిరిపోస్తామని అన్నారు. అంటే కేవలం మూడు నెలల్లోనే రూ.50వేల కోట్ల నుంచి రూ.లక్షన్నర కోట్లకు వ్యయం పెరిగినట్టు అర్థమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

