హైదరాబాద్, జూలై18 (నమస్తే తెలంగాణ): నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ఈఎన్సీ అనిల్‌కుమార్, ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ రమణారెడ్డి, ఇతర అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
సాధ్యమైనంత త్వరగా లిఫ్ట్ పనుల గ్రౌండింగ్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నీరందుతుందని వెల్లడించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై ప్రతీ నాలుగు వారాలకోసారి సమీక్షిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కొడంగల్‌లో ఫిష్ మారెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.