CM Revanth Reddy | ఓటుకు నోటు ఈడీ కేసు.. విచారణకు సీఎం రేవంత్ గైర్హాజరు
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో వచ్చే నెల 16ను కేసు విచారణ వాయిదా పడింది. గురువారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో వచ్చే నెల 16ను కేసు విచారణ వాయిదా పడింది. గురువారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. విచారణకు సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, మత్తయ్య, సెబాస్టియన్ హాజరు కాగా, సీఎం రేవంత్ రెడ్డి, వేం కృష్ణ కీర్తన్ గైర్హాజరయ్యారు. కాగా, గత నెల 16న జడ్జి లీవ్‌లో ఉండటంతో కోర్టు కేసును నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
2015 మే 31న ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మరో ఎమ్మెల్యే స్టిఫెన్సన్కు నోట్ల కట్టలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్టు అభియోగాలున్నాయి. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రేవంత్‌రెడ్డితోపాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహ, సండ్ర వెంకటవీరయ్యతోపాటు రూ.50 లక్షలు సమకూర్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వేం కృష్ణకీర్తన్ తదితరులపై కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే ఓటుకు నోటు కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించిన ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా నాంపల్లిలోని ఈడీ కోర్టులో చార్జ్జిషీట్ దాఖలు చేసింది.
అయితే, ఈడీ కోర్టు విచారణకు నిందితులు కొంతకాలంగా హాజరు కావడం లేదు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మిగతా నిందితులు సైతం కోర్టుకు హాజరుకాకుండా, గైర్హాజరీ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. దీనిని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నిందితులు కోర్టుకు హాజరుకాకుండా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ మండిపడింది. మరోవైపు, ఏసీబీ నమోదుచేసిన ఓటుకు నోటు కేసు విచారణ కూడా నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో కొనసాగుతున్నది. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారని, ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

