CM Revanth | ఉత్తమన్నా జర ప్రెస్‌మీట్ పెట్టరాదే..! రుణమాఫీ రగడపై సీఎం వేడుకోలు..!
రుణమాఫీపై జరుగుతున్న రగడను సద్దుమణిగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నానా తంటాలు పడుతున్నట్టు తెలిసింది. కనీసం మంత్రులతోనైనా మీడియా సమావేశం పెట్టించి డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.
- గొడవను సద్దుమణిగించేలా మంత్రులతో మీడియా సమావేశం పెట్టాలని నిర్ణయం
- ప్రెస్‌మీట్ పెట్టేందుకు తుమ్మల నిరాకరణ
- సీఎం విన్నపంతో సరేనన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): రుణమాఫీపై జరుగుతున్న రగడను సద్దుమణిగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నానా తంటాలు పడుతున్నట్టు తెలిసింది. కనీసం మంత్రులతోనైనా మీడియా సమావేశం పెట్టించి డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఇటీవల ఒక సందర్భంలో సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్టు తెలిసింది. రుణమాఫీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, దీనిని నిలువరించేందుకు మంత్రులతో మీడియా సమావేశం ఏర్పాటుకు గురించి చర్చించినట్టు సమాచారం. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్‌బాబు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మీడియా సమావేశం నిర్వహించాలని కోరగా మంత్రి నిరాకరించినట్టు సమాచారం. ఇప్పటికే మీడియా సమావేశం నిర్వహించానని, మళ్లీ సమావేశం పెట్టాల్సిన అవసరం లేదని తోసిపుచ్చినట్టు తెలిసింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి అక్కడే ఉన్నత ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి.. ‘ఉత్తమన్నా.. మీరన్నా ప్రెస్‌మీట్ పెట్టండి’ అని కోరినట్టు తెలిసింది. ఇందుకు అంగీకరించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రుణమాఫీ పూర్తికాలేదని, ఇంకా 9.14 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉన్నదని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

