బీసీలకు 42 శాతం కోటాపై ఏమీ చేయలేం!.. రిజర్వేషన్‌పై ఇంతకుమించి ముందుకెళ్లలేం!
బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఎంత చేయాలో అంతా చేశామని, ఇక ఇంతకుమించి ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పినట్టు తెలిసింది.
- పీఏసీ సమావేశం పెట్టి ఓ నిర్ణయానికి వద్దాం
- సిగాచికి నేను వెళ్లాక.. ‘ఆమె’ ఎందుకెళ్లింది?
- రాష్ట్రంలో సమాంతర పాలన నడిపిస్తున్నదా?
- ఈ అర్ధాంతర పాదయాత్ర పరమార్థమేమిటి?
- పీసీసీ చీఫ్‌తో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చలు
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఎంత చేయాలో అంతా చేశామని, ఇక ఇంతకుమించి ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించడమా? లేదంటే పాత ప్రభుత్వం పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లడమా? అనేదే మన ముందున్న తక్షణ కర్తవ్యం అని ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో అన్నట్టు తెలిసింది. సోమవారం ఇద్దరి మధ్య గంటన్నరకుపైగా సాగిన సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలి? జనహిత పాదయాత్రలో ఎట్లా ముందుకు నడవాలి? అనే అంశాల మీదనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. రాష్ట్రంలో మనం చేసిన ప్రయత్నాలకు ఢిల్లీలో ఇటు మన వాళ్లు (కాంగ్రెస్ పార్టీ) కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోలేదని నిరాశ వ్యక్తంచేసినట్టు తెలిసింది.
పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కనీసం జంతర్ మంతర్ సభకు కూడా రాకపోవడం అతి పెద్ద పరాజయం అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టు సమాచారం. ‘ఇంటోడే ఈకతోటి కొట్టినంక బయటోడు తోకతోటి కొట్టడా?’ అని అన్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకుందామంటే, అది కూడా బూమరాంగే అయిందని, మనం చేతులు ఎత్తేయడం మినహా ఇక మన వద్ద ఎటువంటి అస్ర్తాలు లేవని అన్నట్టు తెలిసింది. తుది ప్రయత్నంగా ఈ నెల 16 లేదా 17 తేదీల్లో పీసీసీ పీఏసీ సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తాము చేసిన ప్రయత్నాలన్నీ పీఏసీ సమావేశంలో వివరించి మెజారిటీ నాయకుల అభిప్రాయాలతో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.
అర్ధాంతర పాదయాత్ర ఎందుకు?
అర్ధాంతరంగా పెట్టిన జనహిత పాదయాత్ర తలనొప్పిగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ‘ఆమె ఎందుకు పెట్టిందో.. ఎవరిని అడిగి పెట్టిందో నీకైనా తెలుసా.. అన్నా?’ అంటూ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సీఎం అడిగినట్టు సమాచారం. ‘పటాన్‌చెరులోని సిగాచి కెమికల్ పరిశ్రమ సంఘటన వద్దకు ఆమె (మీనాక్షి నటరాజన్) ఎందుకు వెళ్లినట్టు, మీరు వెంట ఉన్నారు కదా.. మీకేమైనా చెప్పిందా?’ అని మహేశ్‌కుమార్‌గౌడ్‌ను అడిగినట్టు తెలిసింది. ‘నేను పరిశీలించి, ప్రకటన చేసిన తరువాత ఆమె వెళ్లడం దేనికి సంకేతం? రాష్ట్రంలో ఆమె సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నదా?’ అని పీసీసీ చీఫ్ వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది.
‘రెండో విడత జనహిత పాదయాత్రలో మీరు ముందుండి కార్యకర్తలను నడిపించాలి. వీలు చూసుకొని నేను వస్తాను. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విసృ్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని సీఎం సూచించినట్టు సమాచారం. ఈ భేటీలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు బోర్డులు, కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలపై కూడా చర్చించినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

