ఎంత ఖర్చయినా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి.. ఏటూరునాగారంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులపై ఏటూరు నాగారంలో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు అభినందనలు సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిశాఖ అధికారులు మూడు షిష్టులు పని చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను దశలవారీగా ఎత్తయిన ప్రాంతాలకు తరలించాలని, గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయన్నారు.
ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. వరద పరిస్థితులపై భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా బుక్‌ను తయారు చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పైపులు చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని, వాటికి తక్షణమే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ములుగు జిల్లాకేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరినందున దీన్ని వెంటనే మంజూరు చేస్తున్నామన్నారు. వరద తక్షణ సహాయం కింద ములుగు జిల్లాకు రూ.2.50కోట్లు, భద్రాచలం జిల్లాకు రూ.2.30కోట్లు, భూపాలపల్లి జిల్లాకు రూ.2కోట్లు, మహబూబాబాద్‌కు రూ.1.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షాలతో వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగులో హెలికాప్టర్, భద్రాచలంలో మరో హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచుతామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్ వేలు, కల్వర్టులను వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.
కరెంటు సౌకర్యాన్ని కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. పక్కాపూర్ గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. శ్యాంపల్లి ఆర్ అండ్‌బీ రోడ్డు పనులను సత్వరమే చేపట్టాలన్నారు. ప్రాంతాల్లో పనులు చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేదన్నారు. నిధులు ఎక్కువ ఖర్చయినా సరే.. నాణ్యమైన పనులు చేపట్టాలన్నారు. ఏజెన్సీ ఏరియాలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే పారిశుధ్య పనులను చేపట్టాలన్నారు. మనందరం ప్రజల కోసమే పనిచేయాలని, ఏ ఒక్కరినీ ఏమీ అనవద్దన్నారు. అటవీశాఖ అధికారులు పనుల ఇబ్బందుల పేరుతో ఏమాత్రం ఇబ్బంది పెట్టొద్దని సీఎం స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

