అడవుల పునరుద్ధరణే సీఎం కేసీఆర్ లక్ష్యం
సీఎం కేసీఆర్ | లంగాణలో క్షీణించిన అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంచాలన్నదే సీఎం కేసీఆర్ హరిత సంకల్పమని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి అన్నారు.

యాదాద్రి భువనగిరి : తెలంగాణలో క్షీణించిన అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంచాలన్నదే సీఎం కేసీఆర్ హరిత సంకల్పమని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి అన్నారు. రాయగిరి సమీపంలోని ఆంజనేయ అరణ్యంలో అటవీ పునర్జీవ చర్యల్లో భాగంగా గుట్టల ప్రాంతంలో (నాటిన సెర్మోనియల్ / రాకీ) ప్లాంటేషన్ ను మంత్రులు పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు.
హరితహారం కార్యక్రమం వల్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో నాలుగు శాతం పచ్చదనం పెరిగిందన్నారు. పర్యావరణ సమతుల్యతతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు.
అడవుల పునర్జీవం, ప్రత్యామ్నాయ అడవుల పునరుద్ధరణ, హరితహారం కార్యక్రమాల వల్ల యాదాద్రి జిల్లాలో పచ్చదనం పెరిగిందన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం పునఃప్రారంభం తర్వాత ఈ ప్రాంతం మరింత కళకళలాడుతుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ వీళ్లే
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

