CM KCR | నాందేడ్ బయల్దేరిన సీఎం కేసీఆర్.. తెలంగాణ వెలుపల తొలిసారిగా శిక్షణ తరగతులు
బీఆర్ఎస్ అధినే, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాందేడ్ బయలుదేరారు. తెలంగాణ వెలుపల మహారాష్ట్రలోని నాందేడ్‌లో (Nanded) బీఆర్ఎస్ పార్టీ (BRS) తొలిసారిగా శిక్షణ తరగతులను (Training classes) నిర్వహిస్తున్నది. రెండురోజులపాటు జరుగున్న ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినే, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాందేడ్ బయలుదేరారు. తెలంగాణ వెలుపల మహారాష్ట్రలోని నాందేడ్‌లో (Nanded) బీఆర్ఎస్ పార్టీ (BRS) తొలిసారిగా శిక్షణ తరగతులను (Training classes) నిర్వహిస్తున్నది. రెండురోజులపాటు జరుగున్న ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి బెంగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక విమానంలో నాందేడ్ బయలుదేరారు. మరికాసేటపట్లో మరఠ్వాడకు చేరుకోనున్నారు.
శిక్షణ శిబిరం నిర్వహించే అనంత్‌లాన్స్ వేదిక మొత్తం గులాబీ మయమైంది. నాందేడ్ వ్యాప్తంగా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, దేశ్ కీ నేత కైసే హో కేసీఆర్ జైసే హో.. దేశ్ కీ నేత కేసీఆర్ వంటి నినాదాలతో ఫ్లెక్సీలు ఆకర్షిస్తున్నాయి. నాందేడ్ విమానాశ్రయం నుంచి అనంత్‌లాన్స్ మార్గంతోపాటు రైల్వేస్టేషన్ సహా ప్రధాన కూడళ్లలో గులాబీ ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి. కాగా, మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు శిక్షణా శిబిరాలకు తరలివచ్చారు.
ప్రచార సామగ్రితోపాటు ల్యాప్‌ట్యాప్, ట్యాబ్
రెండు రోజుల శిక్షణ అనంతరం నియోజకవర్గాలవారీగా పార్టీ ప్రచార సామగ్రి.. కరపత్రాలు, గులాబీ కండువాలు, టోపీలు, వాల్‌పోస్టర్లను పార్టీ బాధ్యులకు అందజేస్తారు. వాటితోపాటు నెలరోజులపాటు చేపట్టనున్న పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన పుస్తకాలను కూడా నియోజకవర్గాలవారీగా పంపిణీ చేస్తారు. మహారాష్ట్ర స్థానిక కళా సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, వివిధ కళారూపాలకు సంబంధించిన సాంస్కృతిక బాండాగారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- CM KCR
- Maharashtra
- Nanded
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

