CM KCR | దేశ చరిత్రలోనే కాళేశ్వరం అపూర్వ ఘట్టం : సీఎం కేసీఆర్
CM KCR | ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం త్వరలోనే సాకారం కానుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా (Telangana Decade celebrations) హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
CM KCR | ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం త్వరలోనే సాకారం కానుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా (Telangana Decade celebrations) హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప.. తెలంగాణ పొలాలకు ఏనాడూ సాగునీరు లభించలేదని అన్నారు. తలాపునా పారుతుంది గోదారి.. మన చేను మన చెలుకా ఎడారీ అని దీనంగా పాడుకున్న పాటల సాక్షిగా.. తెలంగాణ పొలాల దాహార్తిని తీర్చితీరాలనే పట్టుదల ఉద్యమకాలం నుంచే నా మనసును ఆవహించిందని.. సాగునీటి రంగంలో సాధించాల్సిన లక్ష్యాలను ఆనాడే స్పష్టంగా నిర్దేశించుకున్నానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే, సంవత్సరాల తరబడి నిర్లక్ష్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడం, నాగార్జున సాగర్, నిజాంసాగర్, శ్రీరాం సాగర్ వంటి పాత ప్రాజెక్టులను ఆధునికీకరించడం, ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించని ప్రాజెక్టు పనులు తక్షణం చేపట్టడం, అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించుకొని, పంటల దిగుబడి పెంచడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
వలసల జిల్లా పాలమూరు.. ఇప్పుడు పచ్చని చేలతో కళకళలాడుతోంది
సమైక్య రాష్ట్రంలో మూలకుపడ్డ కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేయడం ద్వారా 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో వలసల జిల్లాగా పేరుబడ్డ ఉమ్మడి పాలమూరు నేడు పంట కాలువలతో పచ్చని చేలతో కళకళలాడుతున్నదని అన్నారు. ‘ గతంలో పొట్ట చేతబట్టుకొని వలసవెళ్ళిన జనం సొంత ఊళ్లకు తిరిగి వచ్చారు. సంతోషంగా తమ పొలాలు సాగు చేసుకుంటున్నారు. అద్భుతమైన ఈ మార్పుకు అద్దంపడుతూ ‘‘వలసలతో వలవల విలపించు కరువు జిల్లా, పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసి, చెరువులన్ని నింపి, పన్నీటి జలకమాడి, పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది..’’ అని నేనే స్వయంగా పాట రాశాను. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80శాతం పైగా పూర్తయింది. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలలో ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుంది.’ అని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయని. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేసి రైతుల పంట పొలాలకు సాగునీరు అందించబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నానని తెలిపారు.
దేశ చరిత్రలోనే కాళేశ్వరం అపూర్వ ఘట్టం
20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు, మరో 20లక్షల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడానికి ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. ప్రపంచంలోకెల్లా పెద్దదైన ఈ బహుళ దశల భారీ ఎత్తిపోతల పథకాన్ని వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు రాత్రింబవళ్ళు శ్రమించి కేవలం మూడున్నరేండ్ల స్వల్ప కాలంలో పూర్తిచేశారు. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ప్రవహించే గోదావరి నదిని భారీ పంపుల ద్వారా గరిష్టంగా 618 మీటర్లకు ఎత్తిపోయడం జరుగుతున్నది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిని 250 కిలోమీటర్ల మేర సతత జీవధారగా మార్చింది. దాదాపు 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అభివృద్ధిలోకి తెచ్చింది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు 20 కి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. తెలంగాణ ఏర్పడిన తొలిదశలోనే ప్రభుత్వం అనుసరించబోయే సాగునీటి విధానంపై రాష్ట్ర శాసన సభలో నేనే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాను. ఈ విధానం ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు 75 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది. రెండు, మూడేళ్లలో మరో 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో సుజల, సుఫల, సస్యశ్యామల రాష్ట్రంగా తెలంగాణ విరాజిల్లుతోంది. రాష్ట్రంలో 1 కోటి 25లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం త్వరలోనే సాకారం కానుంది.’ సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

