CM KCR | ఎవరు గెలిస్తే మంచిదో నిర్ణయించి ఓటేయాలి.. అలవోకగా వేయొద్దు : సీఎం కేసీఆర్
CM KCR | ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కాకుండా.. ఎవరు గెలిస్తే మంచిదో నిర్ణయించి ఓటేయాలి.. ఆషామాషీగా, అలవోకగా ఓటు వేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
CM KCR | కాగజ్‌నగర్ : ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కాకుండా.. ఎవరు గెలిస్తే మంచిదో నిర్ణయించి ఓటేయాలి.. ఆషామాషీగా, అలవోకగా ఓటు వేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ రావాల్సిన పరిణితి రాలేదు. ఏ దేశాల్లో అయితే ప్రజాస్వామ్యంలో పరిణితి వచ్చిందో ఆ దేశాలు చాలా బాగా ముందుకు పోతున్నాయి. మన దేశంలో ఇంకా ఆ పరిస్థితి లేదు. రావాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లు చాలా వస్తాయి పోతాయి. ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలుస్తరు అందరికీ తెలసు. మీరు చాలా సార్లు ఓట్లేశారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ప్రతి పార్టీ తరపున ఒకరు నిలబడుతారు. కోనప్ప బీఆర్ఎస్ తరపు ఉన్నారు. 30న ఓట్లు పడుతాయి. 3న లెక్కింపు అయిపోతది. ఫలితం తేలుతుందన్నారు కేసీఆర్.
మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఏందంటే అభ్యర్థి గుణగణాలు, సేవాతత్వం గురించి ఆలోచన చేయాలి. ఆ అభ్యర్థుల వెనుకాల ఏ పార్టీ ఉంది. వాటి చరిత్ర విధానాలు, ప్రజలు, రైతుల గురించి ఏం ఆలోచిస్తుంది..? అధికారం వస్తే ఎలా ప్రవర్తిస్తారో ఆలోచించాలి. ఎన్నికలు అయిపోగానే ప్రక్రియ ఆగిపోదు. ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. మీ ఓటు వజ్రాయుధం, చాలా విలువ ఉంటది. ఐదేండ్లు మీ తలరాతను రాస్తది. భవిష్యత్‌ను నిర్ణయిస్తది. అందుకే జాగ్రత్తగా ఓటు వేయాలి. ఆషామాషీగా, అలవోకగా వేయొద్దు. మంచి ఆలోచించే వారికి ఓట్లు వేయాలి. ఏ ప్రభుత్వం ఏం చేసిందో లెక్క తీసి ఓట్లు వేస్తే లాభం జరుగుతది. ప్రజాస్వామ్య పరిణితి పెరిగి, విచక్షణ జ్ఞానంతో ఎవరు గెలిస్తే మంచిదో నిర్ణయించి ఓటేయాలి అని ప్రజలకు కేసీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

