CM KCR | ఇస్నాపూర్ వరకు మెట్రో.. పటాన్చెరు దశనే మారిపోనుంది : సీఎం కేసీఆర్
CM KCR | పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో టోటల్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా మెట్రో వచ్చేస్తే పటాన్చెరు దశనే మారిపోతది అని కేసీఆర్ పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, మహిపాల్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
CM KCR | పటాన్చెరు : పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో టోటల్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా మెట్రో వచ్చేస్తే పటాన్చెరు దశనే మారిపోతది అని కేసీఆర్ పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, మహిపాల్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
పటాన్చెరులో పరిశ్రమల కాలుష్యం వల్ల ఎటువంటి నీళ్లు తాపారు కాంగ్రెస్ రాజ్యంలో. ఎలాంటి జవ్వులు వచ్చేవి. ఎలాంటి చర్మ వ్యాధులు వచ్చేవి. ఈ రోజు మన సొంత రాష్ట్రం కాబట్టి, మనకు కడుపు నొప్పి ఉంటది కాబట్టి.. మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు పరిశ్రుభ్రమైన నీళ్లు అందిస్తున్నాం. ఇప్పుడు ఆ జబ్బుల బాధ తప్పింది. రోగాల బాధ తప్పింది. కార్మికుల అవసరాల కోసం 350 పడకల ఆస్పత్రికి శంకుస్థాపనం చేశాం. నిర్మాణం అవుతోంది అని కేసీఆర్ తెలిపారు.
కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం..
పటాన్చెరులో కాలుష్యం తగ్గాలి. కాలుష్యం తగ్గేందుకు కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కు వచ్చింది. హార్ట్ పేషెంట్స్‌కు అమర్చే స్టంట్లు కూడా ఇక్కడే తయారావుతున్నాయి. కంటి వెలుగు అద్దాలు గతంలో చైనా నుంచి తప్పించాం. ఇప్పుడు ఈ నియోజకవర్గంలోనే తయారవుతున్నాయి. మీరు ఆల్మోస్ట్ హైదరాబాద్‌లో కలిసిపోయారు. పటాన్చెరు వేరే కాదు. ముగ్గురు కార్పొరేటర్లు కూడా ఉన్నారు. జీహెచ్ఎంసీలోకి వచ్చేశారు. కాబట్టి మీ దగ్గర బ్రహ్మాఒండమైన కాలుష్యం లేని ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.
పటాన్ చెరు నియోజకవర్గం మినీ ఇండియా..
ఔటర్ రింగ్ రోడ్డు పటాన్చెరు మీద నుంచే పోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు డెఫినెట్‌గా మెట్రో వస్తది. దాంతో చాలా లాభం జరుగుతది. రాబోయే రోజుల్లో టోటల్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో వచ్చేస్తే పటాన్చెరు దశనే మారిపోతదని మనవి చేస్తున్న. ఇక్కడ అమీన్పూర్లో 15, 20 కాలనీలు ఉండేవి. ఇవాళ 300 కాలనీలు వచ్చాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ మాదిరిగా మినీ ఇండియా. అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు. ఇదొక మినీ ఇండియా. ఉత్తర భారతీయులు ఉంటారు. అన్ని చోట్ల నుంచి ఉంటారు. పరిశ్రమల యజమానులు అందులో పని చేసే కార్మికులు ఉంటారు అని కేసీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- CM KCR
- harish rao
- Isnapur
RELATED ARTICLES
తాజా వార్తలు
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

