CM KCR | నిత్యం పరుల క్షేమం కోసం పరితపించిన ప్రజాకవి కాళోజీ : సీఎం కేసీఆర్
పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిత్యం పరుల క్షేమం కోసమే పరితపించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యాస, భాష, భావుకతకు కాళోజీ సాహిత్యం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, కవిగా కాళోజీ చేసిన సేవలు గొప్పవని పేర్కొన్నారు.
హైదరాబాద్: పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిత్యం పరుల క్షేమం కోసమే పరితపించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యాస, భాష, భావుకతకు కాళోజీ సాహిత్యం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, కవిగా కాళోజీ చేసిన సేవలు గొప్పవని పేర్కొన్నారు.
తెలంగాణ భాష, సాహిత్యానికి కాళోజీ చేసిన కృషిని గౌరవిస్తూ..కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భాషా, సాహిత్య రంగాల్లో విశేష కృషిచేస్తున్న తెలంగాణ సాహితీవేత్తలు, కవులు, వైతాళికులను గుర్తించి.. కాళోజీ నారాయణరావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట పురసారాన్ని అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఏడాదికిగానూ కాళోజీ పురస్కారానికి ఎంపికైన కవి, చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్‌కు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

