కేసీఆర్ జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ పూరీ బీచ్‌లో సైకత శిల్పం
CM KCR | దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ జగన్నాథుడు
హైదరాబాద్ : దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ జగన్నాథుడు కొలువుదీరిన పూరీ పవిత్ర నగరంలో కేసీఆర్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ నేత అలిశెట్టి అరవింద్ కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సైకత శిల్పి సాహు చేత శిల్పాన్ని రూపొందింపజేశారు.
14 ఏండ్ల పాటు అలుపెరుగని పోరాటంతో తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతరం తెలంగాణను దేశానికే మార్గదర్శిగా తీర్చిదిద్దారని అరవింద్ అన్నారు. అదే తరహాలో దేశ భవిష్యత్తును సైతం మార్చగల సత్తా కలిగిన మహోన్నత నేత కెసిఆర్ అని కొనియాడారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన ఇప్పటికీ రైతులు, ఇతర వర్గాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారంటే కాంగ్రెస్, బీజేపీల పాలన వైఫల్యమైననని గుర్తించిన కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధపడ్డారని అన్నారు.
యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్న వేళ దేశ గతిని సైతం మార్చేందుకు నడుం బిగించిన తమ నాయకుడికి వినూత్న రీతిలో ఆహ్వానం పలికేందుకే సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. అద్భుతంగా తీర్చిదిన శిల్పాన్ని వీక్షించేందుకు పూరీలోని స్థానికులు పర్యాటకులు ఆసక్తి కనబరిచారు. భవిష్యత్తు నాయకుడు అంటూ ఫోటోలు తీసుకుని సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అరవింద్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

