CM KCR | సచివాలయంలో ఆగస్టు 25న ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం
CM KCR | సర్వ మత సమానత్వాన్ని కొనసాగిస్తూ, రాజ్యాంగం అందించిన లౌకికవాద స్ఫూర్తి ప్రతిఫలించే విధంగా, తెలంగాణ రాష్ట్రంలో గంగా జమునా తహెజీబ్ ను మరోమారు ప్రపంచానికి చాటే దిశగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు.
CM KCR | సర్వ మత సమానత్వాన్ని కొనసాగిస్తూ, రాజ్యాంగం అందించిన లౌకికవాద స్ఫూర్తి ప్రతిఫలించే విధంగా, తెలంగాణ రాష్ట్రంలో గంగా జమునా తహెజీబ్ ను మరోమారు ప్రపంచానికి చాటే దిశగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ దేవాలయం, మసీదు, చర్చీలను ఒకే రోజున ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా మతపెద్దలను సంప్రదించి అందరికీ ఆమోదయోగ్యమైన తేదీని ఖరారు చేశారు.
ఆగస్టు 25వ తేదీన హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన చేసి దేవాలయాన్ని సీఎం పునః ప్రారంభిస్తారు. అదే రోజున ఇస్లాం, క్రిస్టియన్ మతాల సాంప్రదాయాలను అనుసరించి ఆయా మత పెద్దల ఆధ్వర్యంలో మసీదును, చర్చీలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ మేరకు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ఆర్అండ్బీ ఆధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల పెద్దలతో సంప్రదించి ఒకే రోజున మూడు మతాల ప్రార్థనా మందిరాలను ప్రారంభించే చారిత్రక నిర్ణయాన్ని సీఎం తీసుకున్నారు. తద్వారా సచివాలయ ఉద్యోగులకు ఈ మూడు ప్రార్థనా మందిరాలు అందుబాటులోకి రానున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

