వరంగల్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్‌కు చేరుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ

వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్‌కు చేరుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానం నుంచి ప్రత్యేక వాహనంలో సీఎం కేసీఆర్ ఎంజీఎంకు బయల్దేరారు.
రెండు రోజుల కిందట గాంధీ దవాఖానను పరిశీలించిన విషయం తెలిసిందే. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి, వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మిగతా జిల్లాల్లోనూ పర్యటించాలని సంకల్పించిన సీఎం ఇవాళ వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తున్నారు. ఎంజీఎంను సందర్శించిన తర్వాత వరంగల్ సెంట్రల్ జైలును పరిశీలించనున్నారు.
కాకతీయ మెడికల్ కాలేజీని ఆనుకొని ఉన్న జైలును ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జైలును సందర్శించి, నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి కెప్టెన్ ఇంటికి చేరుకొని భోజనం చేయనున్నారు. ఆ తర్వాత 2 గంటలకు ఎంజీఎం దవాఖానకు వెళ్తారు. రోగులతో మాట్లాడడంతో పాటు దవాఖానలోని మౌలిక వసతులను పరిశీలిస్తారు. అనంతరం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

