BRS | పడిలేచిన కెరటం బీఆర్ఎస్.. మలుపు తిప్పిన జననేత కేసీఆర్ బస్సు యాత్ర
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్, బీజేపీ సాగిస్తున్న ప్రచారంలో వీసమెత్తు నిజం లేదని తేలిపోయింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే ఈ రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో 12 చోట్ల బీఆర్ఎస్తోనే తలపడాల్సి వస్తున్నదంటే ఇప్పటికీ గులాబీ బలం చెక్కు చెదరలేదనడానికి నిదర్శనం.
- చెక్కు చెదరని క్యాడర్.. తరగని ప్రజాభిమానం
- బీఆర్ఎస్తో రెండు జాతీయ పార్టీల ఎదురీత
- 12 చోట్ల బీఆర్ఎస్తో హస్తం, కమలం పోటీ
- ఐదు సీట్లలో కాంగ్రెస్, ఏడు సీట్లలో బీజేపీ
- నాలుగు స్థానాల్లో మాత్రమే త్రిముఖ పోటీ
BRS | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్, బీజేపీ సాగిస్తున్న ప్రచారంలో వీసమెత్తు నిజం లేదని తేలిపోయింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే ఈ రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో 12 చోట్ల బీఆర్ఎస్తోనే తలపడాల్సి వస్తున్నదంటే ఇప్పటికీ గులాబీ బలం చెక్కు చెదరలేదనడానికి నిదర్శనం. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్తో ఏడు చోట్ల బీజేపీ, ఐదు చోట్ల కాంగ్రెస్ పోటీపడుతుండగా, నాలుగు చోట్ల మాత్రమే త్రిముఖ పోటీ నెలకొన్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనా ఐదు నెలలు తిరక్కుండానే బీఆర్ఎస్ తన పూర్వశక్తిని పుంజుకొని పార్లమెంట్ ఎన్నికల బరిలో దూసుకుపోతుండటంతో ఇటు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కు, అటు కేంద్రంలో అధికార బీజేపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి లభించిన స్పం దన ఉప్పెనను తలపించింది. కేసీఆర్ పాలననే మళ్లీ కావాలని ప్రజలంతా ముక్తకంఠంగా నినదించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని, వారి మాయమాటలకు మోసపోయి తప్పు చేశామని వాపోయారు.
కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ వల్ల తెలంగాణకు కించిత్తు మేలు జరిగిన దాఖలాలు లేవని పెదవి విరుస్తూ, బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఊహించని ఈ పరిణామం కాంగ్రెస్, బీజేపీల వెన్ను లో వణుకు పుట్టించడంతో బెంబేలెత్తిన బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా, కాంగ్రె స్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ చుట్టే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు 14 సీట్లు గెలుస్తామన్న కాంగ్రెస్, 10 సీట్లు గెలుస్తామన్న బీజేపీల అంచనాలు తలకిందులయ్యాయి. దింపుడుకళ్లం ఆశతో బీఆర్ఎస్ ప్రభంజనాన్ని నిలువరించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కొన్ని చోట్ల చీకట్లో చేతులు కలపడానికి కూడా వెనుకాడటం లేదని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం శనివారం ముగిసిన సమయానికి బీఆర్ఎస్కు 10 నుంచి 12 చోట్ల విజ యావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 7 లక్షల ఓట్లే తేడా
పార్లమెంట్ బరిలో బీఆర్ఎస్ ఎందుకింత బలంగా ఉన్నదన్నదానికి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను పరిశీలిస్తే తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 92,53,220 ఓట్లు రా గా, బీఆర్ఎస్కు 85,81,549 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 30,31,031 ఓట్లు మాత్రమే వచ్చా యి. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు ఏడు లక్షలు (1.8 శాతం) మాత్రమే. ఈ స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా కాంగ్రెస్ ఐదు నెలల పాలనపై ప్రజల్లో ఉహించని వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. మరో వైపు బీజేపీకి రాష్ట్రంలో బలమైన పునాదులు లేకపోవడంతో బీఆర్ఎస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకొనే అవకాశాలు మెండుగా ఉన్న ట్టు అనేక సర్వేల్లో వెల్లడైంది.
ఐదు సీట్లలో మాత్రమే కాంగ్రెస్ పోటీ
అధికార కాంగ్రెస్ కేవలం ఐదు నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్కు పోటీ ఇస్తున్నది. ఖమ్మం, పెద్దపల్లి, నల్లగొండ, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ ఉన్నది. ఈ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకే విజయావకాశాలు మెండుగా ఉన్న ట్టు సర్వేలు చెప్తున్నాయి. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు కనీస పోటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదని సర్వే నివేదికలు బయటపెట్టాయి.
ఏడు స్థానాల్లో బీజేపీ పోటీ
రాష్ట్రంలో బీజేపీకి బలం లేనప్పటికీ పలు నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దించడంతో ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్-బీజేపీ మధ్య పో టీ నెలకొన్నది. వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీకి 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి, కరీంనగర్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబా ద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, వరంగల్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవదేదు. కరీంనగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను బరిలో దించడం వల్ల గుడ్డిలో మెల్లగా బీఆర్ఎస్కు బీజేపీ అభ్యర్థులు మాత్రమే పోటీ ఇవ్వగలుగుతున్నారు.
కేసీఆర్ పట్ల ప్రజలకు తగ్గని క్రేజ్
బస్సుయాత్రలో కేసీఆర్‌కు రాష్ట్రమంతటా ప్రజ లు నీరాజనాలు పలికారు. కేసీఆర్‌ను చూడగానే సీఎం.. సీఎం అంటూ తాము ఏం కోల్పోయామో గుర్తు చేస్తున్నారు. తెలంగాణను కేసీఆర్ తన విజన్‌తో తీర్చిదిద్దిన తీరు, సంక్షేమం-అభివృద్ధి జోడెడ్లలా తీసుకెళ్లిన నైపుణ్యత, పే దలపై ఆయనకున్న ప్రేమ, వెరిసి కేసీఆర్ పట్ల ప్రజల్లో పాదుకుపోయిన అభిమానం ఎప్పటికీ చెక్కుచెదరని నిరూపితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా క్యాడర్ చెక్కుచెదరలేదు. పార్టీ జెండా నీడలో పదవులు అనుభవించిన కొందరు నాయకులు పక్క చూ పులు చూసినా క్యాడర్లో మాత్రం కించిత్తు తడబాటు కనిపించకపోవడం బీఆర్ఎస్కున్న ప్రత్యేకత. క్యాడర్‌కు పార్టీపై ఉన్న నమ్మకం, కేసీఆర్‌పై ఉన్న అభిమానం, పరిపాలనా దక్షతపై ప్రజలకున్న విశ్వాసం దీనికి కారణం.
బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగడానికి బీజేపీనే కారణం.
– పీసీసీ అధినేత, సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి తప్పిదాల వల్లనే బీఆర్ఎస్ తిరిగి లేచి కూర్చుంది.
– బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి
(వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ పార్టీలు తెలంగాణలో బీఆర్ఎస్తో పార్లమెంట్ ఎన్నికల్లో తలపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని వీరిద్దరూ అంగీకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావమే ఉండదన్న దశ నుంచి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఈ పార్టీకి గ్రాఫ్ పెరిగిందని అంటున్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరాక రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. ఉనికే ఉండదన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రెండు జాతీయ పార్టీల అభ్యర్థులు తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్, బీజేపీల అంచనాలను ఒక్కసారిగా తారుమారు చేసింది.)
ఓటు బ్యాంకు నిలుపుకుంటున్నది
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పొందిన వెనువెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మరలుతున్నదా? లేక బీజేపీకి మరలుతున్నదా? అన్నది బిగ్ క్వశ్చన్‌గా ఉండేది. కానీ కేసీఆర్ తన బస్సుయాత్రతో ఓటు బ్యాంకు ఎక్కడికి వెళ్లకుండా నిలువరించగలిగారు.
– ప్రొఫెసర్ నాగేశ్వర్, రాజకీయ విశ్లేషకుడు
కేసీఆర్ పట్ల అభిమానం తగ్గలేదు
కేసీఆర్ పార్టీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, క్యాడర్ కేసీఆర్ వెంటే ఉన్నారని, సామాన్య ప్రజలకు కేసీఆర్ పట్ల అభిమానం తగ్గలేదని బస్సుయాత్ర వెల్లడిస్తున్నది.
– పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకుడు
కాంగ్రెస్, బీజేపీ ఆశలకు గండిపడింది
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఐదు నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా పుంజుకున్నది. రాజకీయ రణక్షేత్రంలో బీఆర్ఎస్ పడిలేవడంతో పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ పెట్టుకున్న ఆశలకు గండిపడింది.
– ‘ది స్టేట్స్ మెన్’, ప్రముఖ ఆంగ్ల దినపత్రిక
గట్టి పోటీ ఇస్త్తున్న బీఆర్ఎస్
రాష్ట్రంలో ఐదు నెలల కిందట అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలకు గట్టి పోటీ ఇస్తున్నది. 3-4 స్థానాల్లో మినహా మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది.
– సీఆర్ గౌరీశంకర్, రిటైర్డు పొలిటికల్ ఎడిటర్, దక్కన్ క్రానికల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

