CM KCR | ఆసిఫాబాద్ జిల్లా కావడంతో.. మన్యం బిడ్డలకు మంచి జరిగింది : సీఎం కేసీఆర్
CM KCR | ఆసిఫాబాద్ జిల్లా కావడంతోనే.. మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకలతో హాస్పిటల్ కూడా వచ్చిందని, దాంతో మన్యం బిడ్డలకు మంచి జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కోవా లక్ష్మీకి మద్దతుగా ప్రసంగించారు.
CM KCR | ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా కావడంతోనే.. మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకలతో హాస్పిటల్ కూడా వచ్చిందని, దాంతో మన్యం బిడ్డలకు మంచి జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కోవా లక్ష్మీకి మద్దతుగా ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం కాకపోతే ఆసిఫాబాద్ జిల్లా కాకపోయేది. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవరూ కూడా జిల్లా చేయలేదు. మారుమూల ప్రాంతం ఆసిఫాబాద్ జిల్లా అయితదని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. కానీ ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, గిరిజన బిడ్డలకు, పేద వర్గాలకు న్యాయం జరగాలని జిల్లా చేశాం. మీరందరూ చూస్తుండగానే కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు కట్టుకున్నాం. నేనే ప్రారంభించాను. ఆసిఫాబాద్ జిల్లా కావడంతో ఒక మంచి మేలు జరిగింది. వర్షాకాలం వచ్చిందంటే గుట్ట మీద గూడెం, గుట్ట కింద వాగుల నీళ్లు.. ఆ కలుషిత నీళ్లు తాగి అంటురోగాలు వచ్చేవి. గిరిజన బిడ్డలు రోగాల బారిన పడేవారు. మంచం పట్టిన మన్యం అని వార్తలు వచ్చేవి. ఇవాళ ఆ బాధ పోయింది. ఆసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీ వస్తదని ఎవరూ అనుకోలేదు. మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకల హాస్పిటల్ కూడా రావడంతో మన్యం బిడ్డలకు మంచి జరిగింది అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ కోసం పోరాటం చేసిన మహాయోధుడు.. జల్, జంగల్, జమీన్ నినాదంతో కొట్లాడిన మహాయోధుడు మన కొమ్రం భీం. ఆయన పేరు మీద కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అని నామకరణం చేశాను. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కొమ్రం భీం పోరాటం చేసిన స్థలంలో కెరెమెరి ఘాట్స్‌ను ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. 2014 తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వయంగా నేనే అక్కడికి వెళ్లి.. కొమ్రం భీం స్మారక చిహ్నం నిర్మాణం చేసుకున్నాం. ఇవన్నీ మీ కండ్ల ముందున్నాయి.. జరిగాయి అని కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

