Singareni | సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. లాభాల్లో 32శాతం వాటా..!
Singareni | సింగరేణి కార్మికులు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32శాతం వాటా చెల్లించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
Singareni | సింగరేణి కార్మికులు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32శాతం వాటా చెల్లించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.2,222 కోట్ల రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ఇందులో రూ.700కోట్లకుపైగా లాభాలను కార్మికులకు దసరా ముందస్తుగా చెల్లించనున్నట్లు సీఎం కేసీఆర్ రెండు నెలల కిందట మంచిర్యాలలో ప్రకటించారు.
ఈ క్రమంలో ఇచ్చిన మాటమేరకు గతంలో గతంలో 30శాతానికి మించి కార్మికులకు రూ.700కోట్లకుపైగా లాభాల్లో వాటా వచ్చేలా 32శాతం వాటా రూ.711 కోట్లను ప్రకటించారు. ఇటీవలనే కార్మికులకు 11వ వేతన ఒప్పందానికి సంబంధించి 23 నెలల బకాయిలు దాదాపు రూ.1,450 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అక్టోబర్ 23న దసరా ఉండడంతో ముందుగానే లాభాల్లో వాటాను చెల్లించేలా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్మికులకు వాటా వస్తుండడంతోపై కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

