నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వను : సీఎం కేసీఆర్
రంగారెడ్డి : నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వను. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు సర్వశక్తులను ధారపోస్తాను. నా బలగం ప్రజలే. మీ అండదండలు, ఆశీర్వచనం ఉన్నంత వరకు తనకేం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ ప్రసంగించారు.
ఒక ఇల్లు కట్టాఅలంటే చాలా సమయం ఏర్పడుతుంది. రాష్ట్రం ఏర్పడాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ప్రాజెక్టు కట్టాలంటే చాలా సమయం పడుతుంది. మూఢనమ్మకాలు, పిచ్చితో, ఉన్మాదంతో వాటన్నింటిని రెండు మూడు రోజుల్లో కూలగొట్టొచ్చు. ఎంత కష్టమైతది. శిథిలమైపోతది. 58 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడం. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బెంగళూరు సిటీ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందింది. అక్కడి ప్రభుత్వాలు చాలా కష్టపడి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేశారు. 30 లక్షల మందికి ఐటీలో ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరకుతున్నాయి. ఈ సంవత్సరం మన కంటే తక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది. తెలంగాణ ఒక లక్షా 55 వేల ఉద్యోగాలు ఇచ్చింది. కానీ బెంగళూరులో ఈ ఏడాది ఏడెనిమిది వేల ఉద్యోగాలు తగ్గిపోయాయి. అక్కడ వాతావరణాన్ని కలుషితం చేశారు. అలాంటి వాతావరణం తెలంగాణలో, హైదరాబాద్‌లో రావాలా? మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోవాలా? ఆలోచించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ ప్రశ్నించారు.
రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండ
ఇవాళ రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండగా మారిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎకరం భూమి ఉన్న వ్యక్తి కూడా పెద్ద కోటీశ్వరుడు. ఈ మత పిచ్చిల పడి దాన్ని చెడగొట్టుకోవాలా. నీచ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంటే చూసి ఊరుకోవద్దు. ఓట్ల కోసం భారత సొసైటీని గోస పెట్టే పరిస్థితి తెస్తున్నారు. మోదీ ఆగంఆగం అవుతున్నారు. ఉన్న పదవి చాలాదా? అంతకన్న పెద్ద పదవి లేదు కదా..? మన తెలంగాణలో ఎలాంటి కారుకూతలు కూస్తున్నారో ఆలోచించాలి. తెలంగాణ సమాజాం ప్రశాంతంగా ఉంది. అద్భుతమైనటువంటి ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ దుర్మార్గులు, చిల్లరగాళ్లు, మత పిచ్చిగాళ్ల మాయలో పడొద్దని కేసీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

