Statue of Equality | ముచ్చింతల్లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువు మూడో రోజుకు చేరుకున్నది. ఉత్సవాల్లో భాగంగా నేడు యాగశాలలో శ్రీ లక్ష్మీనారాయణ యాగాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సాయంత్రం ప్రవచన మండపంలో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. విష్ణు సహస్రనామ పారాయణంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భారీ ఎత్తున భక్తులు పాల్గొని పారాయణం పఠించారు.
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 7 నుంచి 7:30 గంటల వరకు అతిథులకు సన్మానాలు, ఆశీర్వచనాలు అందించనున్నారు. రాత్రి 7:30 నుంచి 8:00 వరకు మ్యాపింగ్ వీడియో ప్రదర్శనలు, 8 నుంచి 10 వరకు శ్రీమన్నారాయణుడి భజనలు కొనసాగనున్నాయి.