పాతికేండ్ల నుంచి ఇస్త్రీ చేస్తున్న. బొగ్గుతోటి చేసేటప్పుడు పెట్టె లేవట్టుడు, ఊదుడు బాధలుండేది రెక్కలు నొచ్చేది. కరీంనగర్, జగిత్యాల పోయి బొగ్గులు కొనుక్కొని వచ్చేది. ఒక్కోపాలి బొగ్గులు దొరక్కపోతే అక్కడనే రోడ్ల పక్కన పడుకునేది. బొగ్గులతోటి బాగ ఇబ్బంది అయింది. బొగ్గు దొరక్కుంటే రేటు పెంచుతుండె. బొగ్గులు లేక షాప్ బంద్ చేసుకునేటోళ్లం. ఒక అయిదేండ్ల నుంచి కేసీఆర్ సార్ ఫ్రీ కరెంట్ ఇస్తుండు. మేం చిన్నగ కరెంటు పెట్టెలు తెచ్చినం. పని అల్కగైంది.
మాకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంది. స్విచ్ ఆన్ జేసుడు. ఇస్త్రీ జేసుడు. అర్ధరాత్రి అయినా ఇస్త్రీ చేయమని వస్తె చేసిస్తం. బొగ్గుల పెట్టెతోని వేడి తెలువకపోవు. ఏక్దమ్ వేడి అయ్యి పట్టు చీరలు కాలేది. మాకు ఫైన్లు పడేది. ఇప్పుడు పని కరెక్ట్గుంది. ఇప్పుడు పట్టు చీర ఇస్త్రీ చేసేటప్పుడు అరేంజ్మెంట్ చేసుకుంటున్నం. బొగ్గుతోటి ఇస్త్రీ చేశినప్పుడు రోజుల ఎనిమిది గంటలు పట్టేది.
కరెంటుతోని అయిదు గంటల్లోనే అయితంది. అయిదు గంటలల్ల నాలుగైదు సంచులు చేస్తున్నం. అప్పట్ల రెండు సంచులు కాకపోవు. మాకు గిరాకీ మంచిగ అయితంది. ఇప్పుడు పైసలు మంచిగొస్తున్నయ్. కరోనా అప్పుడు షాపులు బంద్ ఉండె. ఎవలూ బయటికెల్లుడు లేదు. ఇస్త్రీ చేసుడు లేదు. కరోనా అయిపోయాక కొంచెం కొంచెం కోలుకుంటున్నం. ఈ సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ లక్ష రూపాయలు లోన్ ఇచ్చింది. దానితోని రంగులేసే పనులు, లాండ్రీ షాపు మెషిన్లు కొనుక్కుంటున్నం. కేసీఆర్ సార్ అన్నివిధాల ఆదుకుంటుండు. సార్ జేయబట్టే ఎప్పటిలెక్క అయిపోయినం. పిల్లల్ని సదివిపిచ్చుకుంటున్నం. ఆనందంగ ఉన్నం. మాకు ఏదంటే అది అయితంది. ఇంకా పాతికేండ్లు కేసీఆర్ సారే సీఎంగా ఉండాలె.
– గునపర్తి సత్యనారాయణ, ధర్మపురి