ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు | పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గంగాజమునా తహజీబ్ జీవన విధానం మరింతగా పరిఢవిల్లాలని, సోదరభావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని సీఎం అభిలాషించారు.
రంజాన్ పర్వదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, అన్నిమతాలకు సమాన గౌరవం ఇస్తూ మత సామరస్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నదని సీఎం తెలిపారు.
ఆర్థికంగా వెనకబడిన ముస్లిం సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని గుర్తు చేసుకున్నారు.
షాదీముబారక్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు పేదింటి ముస్లిం ఆడపిల్లల జీవితాల్లో గుణాత్మక మార్పునకు దోహదపడుతుండడం గొప్ప విషయమన్నారు.
ముస్లిం మైనారిటీ బిడ్డల చదువుల కోసం అమలు పరుస్తున్న వివిధ పథకాలు విజయవంతమయ్యాయని సీఎం తెలిపారు.
ప్రత్యేక గురుకులాలు సత్ఫలితాలను అందిస్తుండడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

