CM KCR | సిరిసిల్లలో ఆ రాతలు చూసి చలించిపోయాను : సీఎం కేసీఆర్
CM KCR | సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని రాసిన రాతలను చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలు అని బాధపడ్డామని కేసీఆర్ గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
CM KCR | రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని రాసిన రాతలను చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలు అని బాధపడ్డామని కేసీఆర్ గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నా 70 ఏండ్ల జీవితంలో సిరిసిల్లలో కనీసం ఓ 170 సార్లు తిరిగాను అని కేసీఆర్ గుర్తు చేశారు. ఇక్కడ బంధుత్వాలు, ఆత్మీయతలు, ఎంతో మంది నా క్లాస్మేట్స్ ఉన్న సిరిసిల్ల ఇది. హెలికాప్టర్లో వస్తుంటే అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ జలధారగా మారింది. సంతోసంగా ఉంది. నేను చిన్నప్పుడు మోటార్ బైక్ మీద, సైకిల్ మీద ముస్తాబాద్ నుంచి వస్తే బ్రహ్మాండంగా మానేరులో నీళ్లు కనిపించేవి. కానీ సమైక్య పాలనలో దుమ్ములేసే పరిస్థితి వచ్చింది. పోతుగల్లు గ్రామం పైన గూడూరు అనే ఊరు ఉండేది. ఆ ఊరికి మా అక్కను ఇచ్చాం. అక్కడ అప్పర్ మానేరు కాలువలో నేను ఈత కొట్టాను. నా కండ్ల ముందే పోతగల్లు గ్రామంలో 15 నుంచి 20 రైస్ మిల్స్ వచ్చాయి. సమైక్య పాలకుల దాడి, దోపిడీ పెరిగాక.. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అవి మాయమైపోయాయని కేసీఆర్ పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రంలో అప్పర్ మానేరు అడుగంటి పోయిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టులోనే తెలంగాణ ఉద్యమ సభ జరిపిన పరిస్థితిని చూశాం. ప్రాణం పోయినా సరే రాష్ట్రం రావాలి. వచ్చిన రాష్ట్రం సజీవ జలధారలతో కళకళలాడాలని కలలు కన్నాం. అప్పర్ మానేరు ఎండాకాలంలో కూడా మత్తడి దుంకుతుంటే సంతోషంగా ఉంది. ఉద్యమ సందర్భంలో జయశంకర్ నాతో కలిసి తిగిరిగేవారు. ఓరోజు మధ్య రాత్రి సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. చావకండి అని రాయించారు. ఆ రాతలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాం. సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలు అని బాధపడ్డాం. ఇక్కడ ఎంపీగా వస్తే ఆదరించి గెలిపించారు. ఒక రోజు హైదరాబాద్‌లో పేపర్ తిరిగేస్తే ఏడుగురు కార్మికులు చనిపోయారు. ఎంపీగా ఉన్న నేను చలించి, చేనేత పెద్దమనషులకు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. పార్టీ డబ్బుల ద్వారా కొంత ఫండ్ సమకూర్చి దండం పెడుతా చనిపోవద్దను అని వేడుకున్నాను. కానీ పూర్తి రిజల్ట్ రాలేదు.. కానీ కొంత ఉపశమనం లభించింది అని కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

