CM KCR | గురువుల పాత్ర వెలకట్టలేనిది.. ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
ఉపాధ్యాయుల దినోత్సవం (మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యం పట్ల వారి కి స్పష్టమైన అవగాహన కలిగించి,
CM KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల దినోత్సవం (మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యం పట్ల వారి కి స్పష్టమైన అవగాహన కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ‘మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ’ అనే సూక్తి, తల్లిదండ్రుల తర్వాత గురువులకు ఉన్న ప్రాధాన్యం తెలియజేస్తున్నదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఉపాధ్యాయుల, విద్యార్థుల సంక్షేమానికి, అభివృద్ధికి సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేస్తున్నదని వివరించారు. గురుకుల విద్యలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, నాణ్యమైన విద్యను అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉన్నదని తెలిపారు. గుణాత్మక విద్యను అందిస్తూ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదువుల్లోనూ, క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటుతుండటం గర్వకారణమని అన్నారు. విద్యారంగ ప్రగతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అంకితభావానికి, చిత్తశుద్ధికి ఇది నిదర్శమని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

