ప్రముఖ సాహితీవేత్త మడిపల్లి భద్రయ్య మృతికి సీఎం కేసీఆర్ శ్రద్ధాంజలి
Madipalli Bhadraiah | నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త మడిపల్లి భద్రయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పురస్కారాలందుకున్న భద్రయ్య దశదినకర్మ సందర్భంగా

హైదరాబాద్ : నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త మడిపల్లి భద్రయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పురస్కారాలందుకున్న భద్రయ్య దశదినకర్మ సందర్భంగా సీఎం శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మడిపల్లి భద్రయ్య సెప్టెంబర్ 18వ తేదీన మరణించిన విషయం తెలిసిందే.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాహితీవనంలో నిత్య సాహితీ కృషీవలుడు మడిపల్లి భద్రయ్య. కవి, గాయకులు, నటులు.. వెరసి బహుముఖ ప్రజ్ఞాశాలి భద్రయ్య. పౌరాణిక నాటకాలు, కవితలు, గీతాలతో,సాహిత్యంలో కళారంగంలో, సమాజ సేవలో ఐదు దశాబ్దాలుగా సేవలందించారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. 1945, జనవరిలో నిర్మల్‌లో జన్మించిన ఆయన ఉపాధ్యాయుడిగా సేవలందించారు. సామాజిక, సాంస్కృతిక, సాహిత్య కళావైభవాలను తెలుపుతూ అనేక పుస్తకాలను రచించారు.
మడిపల్లి సాహితీ సేవలో ‘మన ఆదిలా బాదు, మన భాష-మన యా స’ అనేది విశిష్టమైనది. తెలుగు దనానికి నిజమైన నిదర్శనంగా వేషంలోనూ, భాషలోనూ మన తెలంగాణ భూమి పుత్రుడు ఆయన. సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనకూ ప్రతిస్పంది స్తూ.. అక్షరబద్ధం చేశారు. సమాజోద్ధరణకు నిరంతరం తపించారు. ప్రతి సంఘటననూ కవితా వస్తువుగా మలచుకొని, రాసి, పాడు తూ వాగ్గేయకారుడిగా కీర్తినొందారు.
నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, శ్రీ మడిపల్లి భద్రయ్య మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పురస్కారాలందుకున్న భద్రయ్య దశదినకర్మ సందర్భంగా సీఎం శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు
— Telangana CMO (@TelanganaCMO) September 29, 2021
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

