CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
CM Revanth Reddy : ఎల్‌నినో ముప్పు నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోకుండా.. 'ఇప్పుడు నేనేం చేయలేను, పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంద'ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేతులెత్తేశారు.
CM Revanth Reddy : ఎల్‌నినో ముప్పు నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ‘ఇప్పుడు నేనేం చేయలేను, పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంద’ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేతులెత్తేశారు. ఎల్‌నినోపై సమీక్ష సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం ప్రజలందరూ నీళ్లు, విద్యుత్‌ను పొదుపుగా ఉపయోగించాలని సూచించారు. అయితే.. పక్క రాష్ట్రం నుంచి రూ.15కు విద్యుత్ కొనుగోలు చేసి ఇస్తామని చెబుతూనే, మనకు విద్యుత్ కోతలు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పడంపై సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
చేతులు కాలాక ఆకులు ముట్టుకున్నట్టు అన్న చందంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి తీరు. శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలు ఎల్‌నినోపై అప్రమత్తం చేసినా.. రైతులకు సాగునీటిపై నిర్లక్ష్యం తగదని వారించినా లెక్కచేయని ముఖ్యమంత్రి ఇప్పుడు పొదుపు మంత్రను సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు నీళ్లు, విద్యుత్ వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నారు. అయితే.. ఎల్‌నినో ముప్పును ముందే గ్రహించిన మిగతా రాష్ట్రాలు 9 నుంచి 10 నెలల ముందే నీరు, విద్యుత్ లాంటి సాధారణ అవసరాలను సమకూర్చుకుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు.. ఇతర ప్రతిపక్ష నాయకులతో పాటు కొందరు అధికార పార్టీ నాయకులకు పదేపదే చెప్పినా సరే రేవంత్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కోపంతో కాళేశ్వరం, కల్వకుర్తి, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులను వినియోగించకుండా, నీటిని ఒడిసిపట్టకుండా దిగువకు వదిలేశారు రేవంత్ రెడ్డి. తీరా గోవా, ఢిల్లీ పర్యటనలు ముగిశాక ఎల్‌నినోపై రేవంత్ సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
పైగా, మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. అంతా అయిపోయింది, పరిస్థితి చేయి దాటిపోయింది.. నేనేం చేయలేను అని ముఖ్యమంత్రి హోదాలో ప్రజలను భయపెట్టే మాటలు మాట్లాడటం బుద్ధిహీన శైలికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కరోనా లాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్న సమయంలో కూడా కేసీఆర్ వరుసగా ప్రెస్మీట్లు పెట్టి, ఏం భయపడకండి అని భరోసా ఇచ్చారు. నేనున్నాను, భయపడకుండా ఉంటేనే క్షేమంగా ఉంటారు, పారాసెటమాల్ వేసుకుంటే చాలు అని గులాబీ అధినేత ధైర్యం చెప్పారు. కానీ, కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి అంతా అయిపోయింది, పంటలు వేయకండి, తాగునీటికి కష్టమే, కొందామన్నా విద్యుత్ దొరకడం లేదు’ అని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని విమర్శలు వస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- carona
- CM Revanth Reddy
- El Nino
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

