హైదరాబాద్, ఆగస్టు 15(నమస్తేతెలంగాణ) : అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీవో) ఉపాధ్యక్షుడిగా చిత్తలూరి ప్రసాద్ నియామకమయ్యారు. ఈ మేరకు సంఘం జనరల్ సెక్రటరీ సీఎల్ రోజ్ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఉత్తర్వుల కాపీని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి సమక్షంలో పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్ కలిసి ప్రసాద్‌కు అందజేశారు.
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): పన్ను మోసానికి సంబంధించి రాష్ట్ర జీఎస్టీ అధికారుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అంబికా స్టీల్ మేనేజింగ్ పార్ట్నర్ను అరెస్ట్ చేశారు. సరుకుల వాస్తవ రవాణా లేకుండా నిందితుడు ఈ-వే బిల్లులు సృష్టించి, నకిలీ ఇన్వాయిస్లు జారీచేసి, తప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇట్లాంటి చర్యలు జీఎస్టీ చట్టానికి విరుద్ధమని జూలై 30న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు హైకోర్టును ఆశ్రయించగా, వారి పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పరిణామాల క్రమంలో నిందితులు గోవాకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.