ఆదిలాబాద్ : చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. చిన్నారిపై ఘోరానికి ఒడిగట్టిన నిందితున్ని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.
త్వరితగతిన విచారణ పూర్తయ్యేలా పోలీసు శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశాంతమైన నిర్మల్ పట్టణంలో ఇలాంటి సంఘటన జరుగడం దురదృష్టకరమన్నారు. బాధితులరాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి..
Prabhas 25: అర్జున్ డైరెక్టర్‌తో ప్రభాస్ 25వ చిత్రం.. పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్
Nallagonda | ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించిన గవర్నర్