హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ప్రచార ఖర్చులను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. దేనికి ఎంత వ్యయం చేయాలో సూచించింది. అభ్యర్థులు గతంలో తమ ఖర్చులను తక్కువగా చూపించే వారు. ఈ సారి ఎన్నికల అధికారులే ధరల జాబితాను రెడీ చేశారు. దాని ప్రకారం ఎన్నికల వ్యయాన్ని లెక్కించనున్నారు. నీళ్ల ప్యాకెట్ నుంచి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసే హోర్డింగ్స్, బెలూన్స్, ఎల్ఈడీ తెరలకు సైతం ధరలను నిర్ణయించారు. ఈసారి ఎన్నికల వ్యయాన్ని కూడా ఈసీ పెంచింది. అభ్యర్థి ఖర్చుల వ్యయం గరిష్ఠంగా రూ.28 లక్షలు ఉండగా, దానిని ఈసారి రూ.40 లక్షలు చేసింది.