హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): కులసంఘాల విజ్ఞప్తి మేరకు 8 బీసీ కులాల పేర్లలో మార్పులు, చేర్పులకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. బీసీ కులాల సమస్యలపై ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా బీసీ కమిషన్ బహిరంగ విచారణలు నిర్వహించింది. వివిధ కుల సంఘాల నేతలు కమిషన్‌కు విజ్ఞప్తులు చేశాయి. ఆ ఫిర్యాదులను బీసీ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నది. దొమ్మర, పిచ్చకుంట్ల, తమ్మలి, బుడబుకల, కుమ్మర, రజక, చిప్పోలు, వీరముష్టి కులాల పేర్ల మార్పు కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మార్పులపై అభ్యంతరాలుంటే 18లోగా ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ కార్యాలయంలో తెలపాల్సిందిగా బీసీ కమిషన్ పేర్కొన్నది.
