– కె. లక్ష్మణ్, వెల్దండ.
గొప్ప పదవులు ఉంటే గొప్ప ఇండ్లు ఉంటాయని, సాధారణ-మధ్య తరగతి వారికి చెడు ఇండ్లు ఉంటాయని కాదు. పదవులు కృషితో వస్తాయి. కానీ, వాళ్ల అంతరంగ స్థితి అంత ఉన్నతంగా ఉంటుందని చెప్పడం కష్టం. కారణం, ఆస్థిపాస్తులు, మినిస్టర్ పదవులు అనగానే.. అంతా బాగుంటుందని కాదుకదా! ఎన్నో అంశాలలో, వారి కుటుంబంలో, ఇతర సమస్యలు కూడా ఉండవచ్చు. ఇల్లును కేవలం ఒకే విధమైన కోణంలో చూడవద్దు. గొప్ప కుబేరులు (ధనవంతులు) ఉంటారు కానీ, వారి ఇంట్లో ఒక ఆడపిల్లకు కాళ్లు పడిపోయి ఉంటాయి. పెద్ద పదవి, పటాటోపం ఉంటుంది. దేనికీ కొదవ ఉండదు. ఆ ఇంట్లో మానసిక వైకల్యం ఉన్న కొడుకు ఉంటాడు. ఇలా వారివారి జీవిత నేపథ్యం ఎన్నో కోణాలతో, ఎన్నో ప్రభావాలతో సాగుతుంది. కొందరు వాళ్లకు తెలియకుండానే కాకతాళీయంగా ఉన్నత స్థానంలో ఉంటారు. కొందరు పదవిలో ఉండి కూడా పతనమయ్యే వాళ్లూ ఉంటారు. ఒకటి నిజం. ఏంటంటే.. ‘స్థానబలం-వ్యక్తిత్వం’ గొప్పగా ఉన్నవాళ్లు.. తప్పకుండా జీవితంలో, సమాజంలో రాణిస్తారు. గెలుస్తారు.
– వి. రాధ, గద్వాల.
ఎదురుగా వీధులు వస్తే.. ఆ వీధి పడే దిశను బట్టి ఆ ఇంటి ‘ఎదుగుదల-తరుగుదల’ ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా, దక్షిణం వీధిపోటు. పైగా ఇంటి దక్షిణం వెడల్పుతో సమానంగా వచ్చి పడుతున్నప్పుడు.. ఆ ఇల్లు చాలా ఇబ్బందులకు లోనవుతుంది. మీరు తక్షణం ఇల్లు మారండి. ఇంటి యజమానుల మీద ప్రభావం పడుతుంది. స్త్రీలు అనారోగ్యం పాలవుతారు. ఇంటి ఆర్థిక పరిస్థితి దినదినం దిగజారి పోతుంది.

దక్షిణంవైపు వచ్చే వీధిచూపు ఒక్కటే మంచిది. అది దక్షిణ-ఆగ్నేయంలో ఎదురుగా రోడ్డు రావడం. అది ఎంతో కీర్తి ప్రతిష్ఠలను తెస్తుంది. అదికూడా ఆ ఇంటికి ‘దిశ’ అనుకూలంగా తిరిగి పోకుండా ఉండాలి. మీరు ఉన్న ఇల్లు ఏ విధంగా చూసినా.. ఎదుగుదల ఉండదు. కమర్షియల్‌గా మార్చి అద్దెకు ఇవ్వండి. మీపైన ప్రభావం తగ్గుతుంది. అద్దెవాళ్లు స్థిరనివాసులు కాదు కాబట్టి, ఇబ్బంది ఉండదు.
– వై.ఎల్. శ్రీధర్, చెర్ల.
చాలామంది ఒక్క ఈశాన్యం తప్ప ఏది పెరిగినా.. అది దోషం అనే మైండ్‌సెట్‌తో ఉంటారు. కానీ, శాస్త్రంలో చాలా వివరణలు ఉంటాయి. పడమర-వాయవ్యం వేరు.. ఉత్తర-వాయవ్యం వేరు. అలాగే, దక్షిణ-ఆగ్నేయం వేరు, తూర్పు-ఆగ్నేయం వేరు. ఇంటి స్థలంలో ఏదైనా ఒక మూల.. అది శాస్త్రం ఒప్పుకొనే దిశ పెరిగి ఉండొచ్చు. మీ ఇంటి స్థలం పశ్చిమ-వాయవ్యం పెరిగింది. కానీ, మీకు పడమర రోడ్డు ఉంది. ఇలా ఉన్నప్పుడు పడమర-వాయవ్యం పెరిగి ఉండకూడదు. తద్వారా వీధిపోటు ఏర్పడి, యజమాని శరీరం మీద అనేక ప్రకృతి దాడులు జరుగుతాయి. అలాగే, ఉత్తర-వాయవ్యం కూడా పెరిగి ఉందేమో సరిచూసుకోండి. వాయవ్యం పెరిగిన ఇంట్లో మానసిక అశాంతి ఉంటుంది. అలాగే, ఇంటిలో అనారోగ్య సమస్యలు తిష్టవేసుకొని ఉంటాయి. ప్రధానంగా ఇంట్లో సభ్యుల మధ్య అనుబంధాలు కొరవడుతాయి. అలాగే సొంత బంధువులతో కూడా అభిప్రాయబేధాలు, లీగల్ ఇష్యూలు వస్తాయి. మీరు మీ పడమర-వాయవ్యం మెట్నకు సరిచేసుకోండి. శుభం.
– కె. సందీప్, బీరంగూడ.
ఈమధ్య ఈ ‘డెక్’ అని చెక్కతో చేసే సీటింగ్ విధానం ఒకటి వచ్చి చేరింది. ఇవి ఏవో కావు.. ఇంటికి ముందర ‘అరుగులు’ వేసుకునేవాళ్లం. అవిపోయి.. ‘డెక్’లు వచ్చాయి. ఇంటినుంచి బయటి ఆవరణంలో వీటిని వేసుకోవచ్చు. అయితే, అవి ఆయా పడక గదులకు సపరేటుగా వేసుకోవాల్సినప్పుడు.. అన్ని గదులకూ ఆమోదయోగ్యం కావు. దక్షిణ-నైరుతి పడక గదికి పశ్చిమ-నైరుతిలో ‘డెక్ ఏరియా’ పెట్టుకొని, దాని మీదికి వెళ్లడానికి ఆ పడక గదికి ద్వారం పెడతారు. అది దోషం. ఆ గదికి ఉచ్ఛమైన దక్షిణ-ఆగ్నేయం లేదా పడమర-వాయవ్యం అయినా.. ఇంటికి నైరుతి ద్వారంగా మారి, యజమానిని ‘పతనం’ చేస్తుంది. పడమర-వాయవ్యం పడక గదికి పడమరలో ‘డెక్’ పెట్టుకొని, దానిమీదికి వెళ్లడానికి ఆ గది పశ్చిమ-వాయవ్యం నుంచి డోర్ పెట్టుకొని వాడుకోవచ్చు. ఆ డెక్ ఏరియా ఇంటి పడమర భాగమంతా వేసుకోవచ్చు. అలాగే, తూర్పు-ఆగ్నేయంలోని గదికి తూర్పులో ‘డెక్’ పనికిరాదు. ఇలా అన్ని రకాలుగా చూసుకొని, తెలుసుకొని ఈ ‘డెక్’లు నిర్మించాలి. మన ఇష్టాలు, ఇంటికి కష్టాలు కలిగించవద్దు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143