హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపు లో పలు మార్పులు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 1,500 శ్రీవాణి టికెట్లను టీటీడీ ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నది. వీటిలో 500 దర్శన టికెట్లను మూ డు నెలల ముందుగా ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులో ఉంచుతుంది. మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేస్తున్నది. ప్రస్తుతం రోజువారీ కరెంట్‌బుకింగ్ కోటాలో అందుబాటులో ఉన్న 800 శ్రీవాణి దర్శన టికెట్లలో ఇప్పటికే రూ.10 వేలు విరాళం చెల్లించి దర్శన టికెట్ కోసం వేచి ఉన్న దాతలకు ప్రతిరోజూ 300 టికెట్లు ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయించింది.